ఇండియా పోస్ట్ GDS రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అలర్ట్. ఇప్పటికే ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి మొదటి మెరిట్ లిస్ట్ విడుదల కాగా, తాజాగా రెండో మెరిట్ లిస్ట్ విడుదలైంది. అభ్యర్థులు ఇండియా పోస్ట్ అధికారిక పోర్టల్ indiapostgdsonline.gov.in విజిట్ చేసి తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. మెరిట్ లిస్ట్ పీడీఎఫ్ ఫైల్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
డౌన్‌లోడ్ ప్రాసెస్
- ముందుగా ఇండియాపోస్ట్ అధికారిక పోర్టల్ indiapostgdsonline.gov.in ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలోకి వెళ్లి, ఇండియా పోస్ట్ జీడీఎస్ మెరిట్ లిస్ట్-2024 అనే లింక్ క్లిక్ చేయాలి.
- ఆ తరువాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ రాష్ర్టంపై క్లిక్ చేసి డివిజన్‌ను సెలక్ట్ చేయాలి.
- దీంతో ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్‌మెంట్ మెరిట్ లిస్ట్-2 పీడీఎఫ్ ఫైల్ స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతుంది. సెర్చ్ బార్‌లో మీ పేరు, రోల్ నంబర్ ఎంటర్ చేసి మీ ఫలితం కోసం చెక్ చేయవచ్చు.
ఇండియా పోస్ట్ హర్యానా, జమ్మూ కాశ్మీర్ మినహా అన్ని సర్కిల్స్‌కు సంబంధించిన జీడిఎస్ రిక్రూట్‌మెంట్ మెరిట్ లిస్ట్-2ను తాజాగా విడుదల చేసింది.
ఆగస్టులో ఫస్ట్ లిస్ట్ విడుదల:
జీడీఎస్ రిక్రూట్‌మెంట్ మొదటి మెరిట్ లిస్ట్‌ను ఇండియా పోస్ట్ గత నెల అంటే ఆగస్టు 22న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో పేరు ఉన్న అభ్యర్థులు ఫిజికల్ వెరిఫికేషన్ కోసం హాజరుకావాల్సి ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ నిర్వహించే తేదీల వివరాలను అభ్యర్థుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లకు SMS రూపంలో పంపుతారు.
జులైలో జీడీఎస్ నోటిఫికేషన్ రిలీజ్
ఇండియా పోస్ట్ దేశంలోని 23 పోస్టల్ సర్కిళ్లలో 44,228 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి జులైలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 5 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ వంటి పోస్ట్‌లు భర్తీ కానున్నాయి. ఏపీ నుంచి 1335 ఖాళీలు, తెలంగాణ నుంచి 981 ఖాళీలు ఫిలప్ చేయనున్నారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా దరఖాస్తులను పరిశీలించి మెరిట్ లిస్ట్‌లను ఇండియాపోస్ట్ విడుదల చేస్తోంది. అభ్యర్థులకు తప్పనిసరిగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
జీతభత్యాలు
ఇండియాపోస్ట్ జీడీఎస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ పోస్ట్‌లకు ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు జీతం రూ. 12000 నుంచి రూ.29,380 మధ్య లభిస్తుంది. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, గ్రామీణ డాక్ సేవక్ పోస్ట్‌లకు రూ. 10,000 నుంచి రూ.24,470 మధ్య జీతం ఉంటుంది.
కాగా, ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ఏపీ, తెలంగాణతో పాటు అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని పోస్టల్ సర్కిళ్లలో ఖాళీలు భర్తీ కానున్నాయి.
No comments:
Post a Comment