Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 24 September 2024

మెడికల్ కళాశాలలో ఖాళీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం..

ఈనెల 28లోగా జిల్లా కేంద్రం శివారు చంపక్ హిల్స్ లోని ఎంసీహెచ్ ఆసుపత్రి రెండవ అంతస్తులోని ప్రిన్సిపల్ ఛాంబర్ లో అప్లై చేయాలని చెప్పారు.

ప్రభుత్వ వైద్య కళాశాల జనగామ పట్టణంలో ఉంది. గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సాధించి, ఔత్సాహిక వైద్య విద్యార్థులకు వైద్య పరిజ్ఞానాన్ని అందించేందుకు, ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఉండాలన్న గత ప్రభుత్వ ఆలోచనతో 2023లో జనగామలో మెడికల్ కళాశాలని ఏర్పాటు చేశారు. ఇది కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉంది. నేషనల్ మెడికల్ కమిషన్ నుండి 2023-24 విద్యా సంవత్సరానికి 100 ఎంబిబిఎస్ సీట్లకు అనుమతి లేఖను అందుకుంది.

జనగామలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేందుకు వివిధ కేటగిరీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గోపాల్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 50 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. సిటీ స్కాన్ టెక్నీషియన్, డాటా ఎంట్రీ ఆపరేటర్, టెక్నీషియన్, రేడియో గ్రాఫిక్ టెక్నీషియన్, అనెస్థీషియా టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, డ్రైవర్, థియేటర్ అసిస్టెంట్, గ్యాస్ ఆపరేటర్, వార్డ్ బాయ్స్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. జనగామ జిల్లాకు చెందిన ఆసక్తి, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ఈనెల 28లోగా జిల్లా కేంద్రం శివారు చంపక్ హిల్స్‌లోని ఎంసీహెచ్ ఆసుపత్రి రెండవ అంతస్తులోని ప్రిన్సిపల్ చాంబర్‌లో అప్లై చేయాలని చెప్పారు. అక్టోబర్ 8న ప్రొవిజినల్ లిస్టు, 10న మెరిట్ లిస్టు, 11న ఫైనల్ లిస్టు, 12న ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ఆర్డర్ కాపీలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు www.jangoan.telangana.gov.in లేదా www.gmcjangoan.org వెబ్ సైట్ ను సంప్రదించాలని సూచించారు. జిల్లాకు చెందిన ఆసక్తి కలిగిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.



2 comments:

Job Alerts and Study Materials