ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. యువతకు ఉపాధి ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా పదవ తరగతి మొదలకొని ఆపై చదువులు చదివి.. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగ మేళాలో నిర్వహిస్తూ కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని జూనియర్ ప్రభుత్వ కళాశాలలో ఈనెల 20వ తేదీన మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించే ఈ మినీ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలైన క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ ltd, నవభారత్ ఫెర్టిలైజర్స్, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ ltd, వంటి వంటి మూడు ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయని తెలిపారు. దీనికోసం పదవ తరగతి నుంచి B.SC, MBA లేదా ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు పాల్గొనవచ్చు.
ఈ నెల 20-09-2024 వ తేదీ ఉదయం 09:30 గంటల నుండి ఈ ఉద్యోగ మేళా జరగనుంది. ఇందుకు సంబంధించిన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఉద్యోగ మేళాను జిల్లాలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని.. జిల్లా ఉపాధికల్పనా అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ ఉద్యోగమేళాలో ఎంపికైన వారికి.. ఉద్యోగి అర్హతను బట్టి జీతం పదివేల రూపాయలు నుంచి ఏడాదికి 4LPA లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెజ్యూమ్, విద్యార్హతా జిరాక్సులు, ఆధార్ కార్డు, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజు ఫోటో తీసుకురావాలని సూచించారు.
ఇక అభ్యర్థులు కేవలం ఫార్మల్ డ్రెస్ లో రావలసి ఉంటుందని సూచించారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు ఎన్. శ్రీనివాసులు సెల్ నెంబర్ :- 77994 94856, ఎం. మల్లికార్జున సెల్ నెంబర్ :- 95427 35717 అనే నెంబర్ ను సంప్రదించవచ్చు.
No comments:
Post a Comment