తెలంగాణ ఆర్టీసీ సంస్థ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. హైదరాబాద్ తార్నాకలోని నర్సింగ్ కాలేజీలో ఖాళీలను భర్తీ చేసేందుకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులు ఉన్నాయి. మొత్తం ఐదు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు TGSRTC పేర్కొంది. ఈ మేరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు.
కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేస్తూ తెలిపారు. సెప్టెంబర్ 18వ తేదీన తార్నాకలోని కాలేజీలో వాక్ ఇన్ ఇంటర్య్వూలను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అర్హత గల ఉద్యోగార్థులు పూర్తి వివరాలకు 7075009463, 8885027780 ఫోన్ నంబర్లను సంప్రదించగలరు అని సజ్జనార్ చెప్పారు.
కాగా.. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొఫెసర్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ. 50 వేల జీతం ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రూ. 28 వేలు, ట్యూటర్ కు రూ. 25 వేలు జీతం ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పూర్తి వివరాలకు http://tsrtc.telangana.gov.in వెబ్ సైట్ సంప్రదించాలని ఎండీ సజ్జనార్ సూచించారు.
మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించడంతో సిటీలో రద్దీ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో కొత్త బస్సులను రోడ్లపైకి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ.. అందుకు తగ్గట్లుగా డ్రైవర్, కండక్టర్ పోస్టులను కూడా రిక్రూట్ చేసుకోనుంది. త్వరలో ఈ రిక్రూట్‌మెంట్ పై క్లారిటీ రానుంది.
No comments:
Post a Comment