ప్రస్తుత టెక్ యుగంలో సాఫ్ట్‌వేర్ డెవలపర్స్‌కు మంచి డిమాండ్ ఉంది. అందుకే చాలామంది ఈ రంగంలో సెటిల్ అవుతున్నారు. అయితే వివిధ జాబ్ రోల్స్ కోసం చూసేవారు, ముందు ఇంటర్న్‌షిప్ చేస్తే త్వరగా ఉద్యోగం పొందవచ్చు. ఇది ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌గా పని చేస్తుంది, రెజ్యూమ్ బలాన్ని పెంచుతుంది. సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం చూసేవారు ఈ ఇంటర్న్‌షిప్స్ పూర్తి చేస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ప్రస్తుతం టెక్ ఇండస్ట్రీలో అందుబాటులో ఉన్న సాఫ్ట్‌వేర్ డెలవప్‌మెంట్ ఇంటర్న్‌షిప్ ఆపర్స్ ఏవో చూద్దాం.
* ఎక్స్‌ట్రా లివింగ్- మొబైల్ యాప్ డెవలప్‌మెంట్
హెల్త్ టెక్ కంపెనీ ఎక్స్‌ట్రా లివింగ్ (XtraLiving) ప్రైవేట్ కంపెనీ.. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో మూడు నెలల ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తోంది. ఆండ్రాయిడ్, iOS యాప్ డెవలప్‌మెంట్‌లో వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారు సెప్టెంబర్ 26 లోపు ఇంటర్న్‌షాలా వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ కేవలం ఒక ఇంటర్న్‌ను మాత్రమే ఎంపిక చేస్తుంది. సెలక్ట్ అయిన వారు యాప్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్‌ను డెవలప్ చేయాల్సి ఉంటుంది. నెలకు రూ.7,500 స్టైఫండ్ లభిస్తుంది.
* వెబ్‌ట్రాఫిక్లీ- మొబైల్ యాప్ డెవలప్‌మెంట్
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే వెబ్‌ట్రాఫిక్లీ (WebTrafficly) టెక్ కంపెనీ, ఫుల్ టైమ్ ఆఫీస్ వర్క్ ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేస్తోంది. ఇంటర్న్‌షిప్ వ్యవధి 6 నెలలు. ఇంటర్న్‌షాలా పోర్టల్ విజిట్ చేసి సెప్టెంబర్ 26లోపు దరఖాస్తు చేసుకోవాలి. సెలక్ట్ అయిన వారు మొబైల్ యాప్స్, ప్లే స్టోర్, యాపిల్ స్టోర్‌లో హోస్ట్ యాప్‌లను డెవలప్ చేయడం, ఫైర్‌బేస్ మేనేజ్‌మెంట్ బాధ్యతలు చూసుకోవాలి. స్టైఫండ్ నెలకు రూ.4 వేల నుంచి రూ.10 వేల మధ్య ఉంటుంది.
* స్విస్‌మోట్- మొబైల్ యాప్ డెవలప్‌మెంట్
యూఎస్‌లోని శాన్‌ఫ్రాన్సిస్కో వేదికగా పనిచేసే స్విస్‌మోట్ (Swissmote Inc) కంపెనీ, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో నెల రోజుల ఇంటర్న్‌షిప్ ఆఫర్ అందిస్తోంది. సెప్టెంబర్ 26లోపు ఇంటర్న్‌షాల పోర్టల్ విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. జావా, ఐఓఎస్, స్విఫ్ట్ లేదా ఆండ్రాయిడ్ కోసం కోట్లిన్‌ని ఉపయోగించి మొబైల్ అప్లికేషన్‌లను డెవలప్ చేయడం, టెస్టింగ్, బగ్స్, ఇతర టెక్నికల్ గ్లిచ్‌లను గుర్తించి, పరిష్కరించడానికి సీనియర్ డెవలపర్‌లతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 10 గంటల వరకు వర్క్ చేయాల్సి ఉంటుంది. స్టైఫండ్ రూ.50,000 లభిస్తుంది.
* టెక్‌హాన్స్ ఐటీ సర్వీసెస్
టెక్‌హాన్స్ (Techenhance) కంపెనీ మొబైల్ యాప్ డెవలప్‌మెంట్‌పై ఇంటర్న్‌షిప్‌ను ఆఫర్ చేస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో మూడు నెలల పాటు ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఇంటర్న్‌షాలా పోర్టల్ విజిట్ చేసి సెప్టెంబర్ 29 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. నెలకు రూ.8000 స్టైఫండ్ లభిస్తుంది. ఎంపికైన వారు క్లీన్, ఎఫీషియంట్, మెయింటెనబుల్ కోడ్ రాయాల్సి ఉంటుంది. దాని ఆధారంగా ఐఓఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లపై మొబైల్ యాప్ బిల్ట్, టెస్టింగ్, డెవలప్ చేయాలి, అప్లికేషన్స్ పనితీరు, క్వాలిటీ, రియాక్షన్స్ మానిటర్ చేయాలి.
* ఫిట్‌సాగా(FitSaga)లో iOS యాప్ డెవలప్‌మెంట్
ఫిట్‌సాగా సంస్థ రెండు నెలల పార్ట్‌టైమ్ ఇంటర్న్‌షిప్‌కు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. వర్క్ ఫ్రం హోమ్ విధానంలో వర్క్ చేయవచ్చు. దరఖాస్తుదారులకు MVVM ఆర్కిటెక్చర్, స్విఫ్ట్ కోర్ లైబ్రరీస్‌పై వర్క్ నాలెడ్జ్ తప్పనిసరి. JSON డేటా, Git వెర్షన్ కంట్రోల్ సిస్టమ్, కోడ్ డీబగ్గింగ్, ఆప్టిమైజేషన్ టెక్నిక్ వంటివాటిలో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి. ఈ అర్హతలు ఉన్న అభ్యర్థులు ఇంటర్న్‌షాలా పోర్టల్ విజిట్ చేసి సెప్టెంబర్ 26లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు స్టైఫండ్ రూ.3,000 నుంచి రూ.10,000లోపు ఉంటుంది.
No comments:
Post a Comment