Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 3 September 2024

రాత పరీక్ష లేకుండానే ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెలకు రూ. 50 వేల జీతం!

 నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఎలాంటి రాత పరీక్ష లేకుండా నెలకు రూ.50వేల జీతం అందించే ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తాజాగా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), CNS డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ కన్సల్టెంట్ ఉద్యోగాల భర్తీకి రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. CNS అంటే కమ్యూనికేషన్, నావిగేషన్, సర్వైలెన్స్ సిస్టమ్ అని అర్థం.

ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌లో CNS డిపార్ట్‌మెంట్ కీలకపాత్ర పోషిస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ రిటైర్డ్ అధికారులు ఈ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వీరు ఏఏఐ అధికారిక పోర్టల్ విజిట్ చేసి సెప్టెంబర్ 15లోపు అప్లై చేసుకోవాలి.

* ఖాళీల వివరాలు

ఎయిర్‌ఫోర్ట్ అథారిటి ఆఫ్ ఇండియా CNSలో 215 జూనియర్ కన్సల్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

* వర్క్ ఎక్స్‌పీరియన్స్

VHF ఎక్యూప్‌మెంట్ (Tx/Rx), మ్యాన్‌ప్యాక్ సిస్టమ్, DVR (డిజిటల్ వాయిస్ రికార్డర్) సిస్టమ్, EPABX, X-Bis (RB & HB) DFMD, CCTV, FIDS, NDB, ADS-B, LAN, WAN, MPLS వంటి ఫీల్డ్స్‌లో మెయింటెనెన్స్, ఆపరేషన్స్ పరంగా ఐదేళ్ల వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.

* వయోపరిమితి

అభ్యర్థుల వయసు గరిష్టంగా 70 ఏళ్లలోపు ఉండాలి.

* ఎంపిక ప్రక్రియ

అభ్యర్థులను పర్సనల్/వీడియో కాన్ఫరెన్స్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. కోల్‌కతాలోని ఏఏఐ రీజనల్ హెడ్ క్వార్టర్స్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది.

* అప్లికేషన్ ప్రాసెస్

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పోర్టల్ విజిట్ చేసి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలి. నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిర్ణీత ఫార్మాట్‌లో అప్లికేషన్ నింపాలి. అవసరమైన డాక్యుమెంట్స్‌తో పాటు అప్లికేషన్‌ను hrrhqer@aai.aero అనే ఇమెయిల్ అడ్రస్‌కు సెండ్ చేయాలి.

* జీతభత్యాలు

జూనియర్ కన్సల్టెంట్ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.50,000 ఉంటుంది.

* జాబ్ లొకేషన్స్

ఎంపికయ్యే అభ్యర్థులు ఒక సంవత్సరం పాటు కాంట్రాక్ట్ పద్దతిలో సర్వీస్ అందించాల్సి ఉంటుంది. తూర్పు రిజియన్‌లోని అంబికాపూర్ (ఛత్తీస్‌గఢ్), ఉత్కెలా (ఒడిశా), రూర్కెలా (ఒడిశా), జైపూర్ (ఒడిషా), క్యాంప్ బెల్ బే (A&N దీవులు), శిబ్‌పూర్ (దిగ్లీపూర్) (A&N దీవులు), కూచ్ బెహార్ (పశ్చిమ బెంగాల్)లో ఎయిర్ ఫోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న ఎయిర్‌ఫోర్ట్స్‌లో పని చేయాల్సి ఉంటుంది.

* E3/E4/E5 స్థాయిలో పని

దరఖాస్తుదారులు పీఎస్‌యూ, ఏఏఐ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం పారామిలిటరీ బలగాల్లో E3/E4/E5 స్థాయిలో పనిచేస్తూ రిటైర్డ్ అయి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం ఐదు సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

* ఫుల్ టైమ్ వర్క్

ఎంపికయ్యే అభ్యర్థులు ఒక సంవత్సరం పాటు ఫుల్‌టైమ్ పనిచేయాల్సి ఉంటుంది. ఈ వ్యవధిలో ఇతర అసైన్‌మెంట్‌లను స్వీకరించడానికి అనుమతి ఉండదు. ఎటువంటి వివరణను అందించకుండా ఏ దశలోనైనా నోటిఫికేషన్‌ను రద్దు చేయడం లేదా దరఖాస్తులను తిరస్కరించే హక్కు AAIకి ఉంటుంది.



అప్లై ఆన్లైన్ ఉద్యోగాలు:

CISF Constable

Apply Online

(30/09/2024 Last Date)

RRB Para Medical

Apply Online

(16/09/2024 Last Date)

ఎక్సమ్ డేట్స్:

SSC MTS

Get Notice

(30-09-2024 to 14-11-2024 Exam Date)

TGPSC Group II

Get Notice

(15-12-2024 to 16-12-2024 Exam Date)

ఎక్సమ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్:

UPSC NDA & NA (II)

Download Hall Ticket

(01/09/2024 Exam Date)

SSC CGL

Download Hall Ticket

(09/09/2024 to 26/09/2024 Exam Date)

IBPS CRP Clerk XIV

Download Hall Ticket

(24, 25, & 31-08-2024 Exam Date)

RRB ALP

Get Notice

(28-08-2024 to 06-09-2024 Exam Date)

పరీక్ష ఫలితాలు:

India Post GDS Merit List I

Get Exam Result

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

No comments:

Post a Comment

Job Alerts and Study Materials