నిరుద్యోగ నిర్మూలన కోసం ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వాలు ముందుకు వెళుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు సైతం పలుచోట్ల జాబ్ మేళాలు నిర్వహిస్తూ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. దీంతో ఎంతో మంది నిరుద్యోగ అభ్యర్థులు ఉపాధి పొందుతున్నారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పలు స్వచ్ఛంద సంస్థలు నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ అందించిన అనంతరం వారికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఇలా చేయడం ద్వారా ఎంతో మంది నిరుద్యోగ అభ్యర్థులు ఈ శిక్షణను పొంది ఉద్యోగాలు చేస్తున్నారు. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు సైతం స్టడీ సెంటర్లలో ఉచిత శిక్షణను అందిస్తుంది. ఇందులో సైతం అనేక మంది అభ్యర్థులు ఈ స్టడీ సెంటర్లలో శిక్షణ పొంది ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 12న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు వరంగల్ జిల్లా ఉపాధి కల్పనా అధికారి సిహెచ్. ఉమారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పించేందుకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో పలు ప్రైవేట్ కంపెనీలు పాల్గొంటాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ హైదరాబాద్‌లో వర్చువల్ కేర్‌గా పనిచేయుటకు 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎంపికైన వారికి వార్షిక వేతనం 2.2 లక్షల నుంచి 2.8 లక్షల వరకు ఉంటుంది.
ఎస్ బ్యాంక్ హైదరాబాదులో సీనియర్ ఆఫీసర్‌గా పనిచేయుటకు 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎంపికైన వారికి వార్షిక వేతనం 3 లక్షల వరకు ఉంటుంది. ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కంపెనీలో హైదరాబాద్, వరంగల్‌లో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్‌గా చేయుటకు 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎంపికైన వారికి వార్షిక వేతనం 2.16 లక్షలు ఉంటుంది.
శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్‌గా పనిచేయుటకు 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎంపికైన వారికి వార్షిక వేతనం 3.12 లక్షల వరకు ఉంటుంది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. 22 నుంచి 30 ఏళ్ల వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులని చెప్పారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 12న వరంగల్ ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటిఐ క్యాంపస్ నందు జరిగే జాబ్ మేళాకు హాజరుకావాలి.
ఉమ్మడి జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతీ, యువకులు తమ బయోడేటా, విద్యా అర్హత జిరాక్స్ కాపీలు, పాస్ ఫోటోలతో జాబ్ మేళాలో పాల్గొనాలి. ఉదయం 11 గంటలకు ఈ జాబ్ మేళా ప్రారంభమవుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 70931 68464 నెంబర్‌ను సంప్రదించాలన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
No comments:
Post a Comment