పండగ సీజన్ వచ్చిందంటే చాలు ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో బోలెడన్ని ఆఫర్స్ చూస్తుంటాం. పోటీ ప్రపంచంలో కస్టమర్లను ఆకర్షించడానికి బోలెడన్ని డిస్కౌంట్స్ ఇస్తూ మార్కెట్ చేస్తుంటుంది ఫ్లిప్‌కార్ట్. దీనికి తోడు ప్రస్తుతం డిజిటల్ కొత్త పుంతలు తొక్కుతుండటంతో సాధారణ ప్రజలు మొదలుకొని ఉన్నత వర్గాల వరకు పలు ఆర్డర్స్ ఈ-కామర్స్ వేదికలపైనే చేస్తున్నారు.
కస్టమర్ చేసిన ప్రతి ఆర్డర్ కూడా నేరుగా ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం, డామేజ్ లాంటివి ఉంటే తిరిగి రీప్లేస్ చేయడం ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేకత. ఈ నేపథ్యంలోనే రాబోయే పండగ సీజన్ లో భారీగా ఆర్డర్స్ వస్తాయని అంచనా వేసిన ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యం పెద్ద ఎత్తున ఉద్యోగాల రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలుపెట్టబోతోంది.
మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే బిగ్ బిలియన్ డేస్ 2024 సందర్భంగా దేశవ్యాప్తంగా లక్షకు పైగా ఉద్యోగాలు కల్పిస్తామని ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. ఇన్వెంటరీ మేనేజర్లు, వేర్‌హౌస్ అసోసియేట్స్, కిరాణా పార్ట్‌నర్స్, డెలివరీ డ్రైవర్స్, లాజిస్టిక్స్ కో-ఆర్డినేటర్లు ఇలా పలు విభాగాల్లో ఉద్యోగాల కల్పన ఉంటుందని పేర్కొంది.
పండగల సీజన్‌కు ముందే ఈ రిక్రూట్మెంట్ ఉంటుందని, తగిన శిక్షణ ఇస్తామని ప్రకటించింది కంపెనీ. అధిక డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే తొమ్మిది నగరాల్లో 11 కొత్త ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలను (FCs) ప్రారంభించింది ఫ్లిప్ కార్ట్. దీంతో దేశవ్యాప్తంగా Flipkart మొత్తం FCల సంఖ్య 83కి చేరుకుంది.
Flipkart వారు నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో పాల్గొనటానికి కనీస విద్యార్హత పదో తరగతి. 18 సంవత్సరాల వయసు నుండి 30 సంవత్సరాల వయస్సు కలిగిన స్త్రీలు, పురుషులు అర్హులు.
No comments:
Post a Comment