సింగరేణి సంస్థ కొత్త జాబ్ నోటిఫికేషన్ జారీ అయింది. 21 మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులను భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులకు సెప్టెంబర్ 12 నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 18 అని పేర్కొన్నారు. https://scclmines.com వెబ్ సైట్ లో పూర్తి వివరాలు ఉంటాయి.
ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. వీటికి ఏడాది కాలపరిమితి ఉంటుందని సింగరేణి సంస్థ తెలిపింది. అర్హతలు ఉన్న అభ్యర్థులకు కేవలం ఇంటర్వూ ద్వారానే రిక్రూట్ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారి వయసు 64 ఏళ్ల లోపు ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ. 1,25,000 జీతం ఉంటుంది. అప్లై చేసినవారికి సెప్టెంబర్ 21వ తేదీన ఇంటర్వూలు నిర్వహించనున్నారు. S.C.C.L. హెడ్ ఆఫీస్, కొత్తగూడెం, తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇంటర్వూలు జరుగుతాయి.
అర్హతలు:
వైద్య విద్యలో డిగ్రీతో పాటు పీజీ పూర్తి చేసి ఉండాలి. అనుభవం మస్ట్. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారం నోటిఫికేషన్ లో వివరాలను చూడొచ్చు.
No comments:
Post a Comment