మీరు పదవ తరగతి ఆపై చదువులు చదివి ఉద్యోగం దొరకక ఇబ్బంది పడుతున్నారా? ఇక నిరుద్యోగులకు ఆ చింతే అవసరం లేదు. ప్రభుత్వం APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు కలిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం... రాష్ట్రంలోని నిరుద్యోగ యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.
యువతకు ఉపాధి ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా పదవ తరగతి మొదలుకొని ఆపై చదువులు చదివి, ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగ మేళాలో నిర్వహిస్తూ కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.
ఇందులో భాగంగానే కర్నూలు జిల్లా కేంద్రంలోని బి - క్యాంప్‌లో ఉన్న సిల్వర్ జూబ్లీ కళాశాలలో ఈనెల 20వ తేదీన మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. ఈ మెగా జాబ్ మేళాలో 6 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ జాబ్ మేళాలో అమర్ రాజా గ్రూప్, IT BRISK, Navabharath fertilizers, Tata Capital's, Credit Access Grameen Ltd, Muthoot Finance, వంటి ప్రముఖ కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పాల్గొంటున్నాయి. దీనికోసం పదవ తరగతి, ఇంటర్, B.Sc, MBA ఏదైనా డిగ్రీ పూర్తి చేసుకున్న నిరుద్యోగులు పాల్గొనవచ్చు.
సెప్టెంబర్ 20 తేదీ ఉదయం 10 గంటల నుండి ఈ ఉద్యోగమేళా జరగనుంది. ఇందుకు సంబంధించిన కర్నూలు జిల్లా కేంద్రంలోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఉద్యోగ మేళాను జిల్లాలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని, జిల్లా ఉపాధికల్పన అధికారి పి. దీప్తి తెలిపారు. ఈ ఉద్యోగం మేళాలో ఎంపికైన వారికి.. ఉద్యోగి అర్హతను బట్టి జీతం నెలకు పదివేల రూపాయలు నుంచి ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు.
అదేవిధంగా ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెజ్యూమ్, విద్యార్హతా జిరాక్సులు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని సూచించారు. ఇక అభ్యర్థులు కేవలం ఫార్మల్ డ్రెస్ రావాల్సి ఉంటుందని సూచించారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం వై.అభిలాష్ (9059524482), పీ.కర్ణ (77804 78910) కు కాల్ చేయొచ్చు.
No comments:
Post a Comment