రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (Railway Recruitment Board) మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 8113 కేటగిరీస్ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (గ్రాడ్యుయేట్) పోస్టుల భర్తీకి సంబంధించిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో 3144 గూడ్స్ ట్రైన్ మేనేజర్, 1736 టికెట్ సూపర్ వైజర్, 1507 టైపిస్ట్, 994 స్టేషన్ మాస్టర్, 732 సీనియర్ క్లర్క్ పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు అప్లై చేసేవారికి డిగ్రీ అర్హత ఉండాలి. 18 నుంచి 36 ఏళ్లలోపు వయసు వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 13 వరకు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చని రైల్వే బోర్డు తెలిపింది. అక్టోబర్ 16 నుంచి 25వ తేదీ వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు.
దరఖాస్తు ఫీజును రూ.500. అయితే పరీక్షకు హాజరైతే రూ.400 రీఫండ్ చేస్తారు. పరీక్షలకు హాజరై ఉద్యోగానికి అర్హత పొందిన వారికి నెలకు రూ.29,200 నుంచి రూ.35,400 వరకు జీతం ఇస్తారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలకు RRB అధికారిక వెబ్‌సైట్ https://www.rrbapply.gov.in/ చూడొచ్చు.
ఈ పోస్టులతో పాటు 3445 అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ పోస్టులకు గాను దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 21న ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 20 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఈ తేదీల ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్/12వ తరగతి ఉత్తీర్ణత అర్హత ఉండాలి.
No comments:
Post a Comment