భారతీయ రైల్వే నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. కేవలం పదో తరగతి అర్హతతో అప్రెంటీస్ అవకాశం కల్పిస్తోంది. ఈస్టర్న్ రైల్వే (ER) విభాగం, అప్రెంటీస్ చట్టం, 1961, అప్రెంటీస్‌షిప్ రూల్స్ 1992 ప్రకారం ఈస్టర్న్ రైల్వే జోన్‌లోని వర్క్‌షాప్‌లు, డివిజన్లలో అప్రెంటీస్ ట్రైనింగ్ కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ - ఈస్టర్న్ రైల్వే అధికారిక వెబ్‌సైట్ www.rrcer.org ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్ విండో సెప్టెంబర్ 24 ఉదయం 11 గంటలకు ఓపెన్ అవుతుంది. అక్టోబర్ 23 సాయంత్రం 5 గంటలకు క్లోజ్ అవుతుంది. ఎంపికైన అభ్యర్థులు ప్రతినెలా రూ. 10,000 వరకు స్టైఫండ్ పొందవచ్చు.
* ఖాళీల వివరాలు
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద, ఈస్టర్న్ రైల్వే జోన్‌లలో మొత్తం 3,115 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది. హౌరా డివిజన్లో 659 ఖాళీలు, లిలూహ్ వర్క్‌షాప్లో 612 ఖాళీలు, సీల్దా డివిజన్లో 440 ఖాళీలు, కంచరపర వర్క్‌షాప్ 187 ఖాళీలు, మాల్డా డివిజన్ 138 ఖాళీలు, అసన్సోల్ డివిజన్ 412 ఖాళీలు, జమాల్‌పూర్ వర్క్‌షాప్‌లో 667 ఖాళీలున్నాయి.
* అర్హత ప్రమాణాలు
అప్రెంటీషిప్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. NCVT/SCVT నుండి నోటిఫైడ్ ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కూడా పొంది ఉండాలి. అభ్యర్థుల వయస్సు 15 ఏళ్ల నుండి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వుడ్ కేటగిరీలకి చెందిన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
* అప్లికేషన్ ప్రాసెస్
- అభ్యర్థులు ఆర్‌ఆర్‌సీ ఈస్టర్న్ రైల్వే అధికారిక వెబ్‌సైట్ www.rrcer.org విజిట్ చేయాలి.
- హోమ్‌పేజీలో ‘RRC/ER/Act Apprentices/2024-25’ నోటిఫికేషన్ లింక్ ఓపెన్ చేయండి.
- అవసరమైన అన్ని వివరాలను ఎంటర్ చేసి నూతన అకౌంట్ క్రియేట్ చేయండి.
- మీ లాగిన్ వివరాలను ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. అప్లికేషన్ ఫామ్ నింపండి.
- అవసరమైన అన్ని డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి. అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
- అన్ని వివరాలను రివ్యూ చేసి అప్లికేషన్ ఫామ్ సబ్‌మిట్ చేయండి.
- దరఖాస్తు ఫారమ్ కాపీని సేవ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.
* అప్లికేషన్ ఫీజు
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
* స్టైఫండ్ ఎంత ఉంటుంది?
ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెలా రూ. 10 వేల స్టైఫండ్ అందుతుంది. ఇతర అలెవెన్సులు ఉండవు.
* సెలక్షన్ ప్రాసెస్
అభ్యర్థులు వేర్వేరు డివిజన్లను వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల పదో తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. అనంతరం అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. ఫైనల్ సెలక్షన్ తర్వాత ఆఫర్ లెటర్లను రిలీజ్ చేస్తారు.
No comments:
Post a Comment