ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-2024 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు (AP TET 2024 Hall Tickets) విడుదలయ్యాయి. అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ https://aptet.apcfss.in/ నుంచి ఈ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం నిర్వహించబోతున్న ఈ టెట్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నారు.
వీళ్లందరీకీ అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. రోజుకు రెండు సెషన్ల చొప్పున టెట్ పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. అభ్యర్ధులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
APలో టీచర్ పోస్టుల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వారందరికీ తీపి కబురు వినిపించింది చంద్రబాబు ప్రభుత్వం. మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ ఫైల్‌పై సీఎం సంతకం చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి కూడా మెగా డీఎస్సీ రాసేందుకు అవకాశం కల్పించేలా టెట్ పరీక్ష నిర్వహించబోతున్నారు.
టెట్ పరీక్ష రాసే అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లు అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుతం. పాఠశాల విద్యా విభాగం అధికారిక వెబ్‌సైట్‌లో అన్ని సబ్జెక్టులకు మాక్ టెస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. దీనికి ఎలాంటి పాస్‌వర్డ్ లేకుండానే వివిధ మాధ్యమాల్లో మాక్ టెస్టులు ఎవరైనా వినియోగించుకోవచ్చు. టెట్ పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
No comments:
Post a Comment