మీరు పదో తరగతి పాసయ్యారా..? వంట చేయడంలో మంచి నైపుణ్యం ఉందా? అయితే ఐటీబీపీలో కానిస్టేబుల్(కిచెన్ సర్వీసెస్)గా కొలువు సాధించే అవకాశం వచ్చింది. దేశ రక్షణ దళాల్లో కీలకమైన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) ఫోర్స్ తాజాగా కానిస్టేబుల్ (కిచెన్ సర్వీసెస్) రిక్రూట్మెంట్ను ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు ITBP అధికారిక వెబ్సైట్ recruitment.itbpolice.nic.in విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఈ గడువు అక్టోబర్ 1న ముగుస్తుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలను పరిశీలిద్దాం.
* ఖాళీల వివరాలు
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) దళం మొత్తంగా 819 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అందులో 697 ఖాళీలు పురుష అభ్యర్థుల నుంచి, 122 ఖాళీలు మహిళా అభ్యర్థుల నుంచి భర్తీ చేస్తుంది. జనరల్ కేటగిరీలో 458 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 162 పోస్టులు, ఎస్టీలకు 70, ఆర్థికంగా బలహీన వర్గాలకు 81, ఎస్సీ అభ్యర్థులకు 48 పోస్టులు రిజర్వ్ చేసింది.
* వయోపరిమితి
ITBP కానిస్టేబుల్ (కిచెన్ సర్వీస్) రిక్రూట్మెంట్కు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
* ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్
అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అదేవిధంగా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్/ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి ఫుడ్ ప్రొడక్షన్ లేదా కిచెన్లో NSQF లెవల్ 1 కోర్సును పూర్తిచేసి ఉండాలి.
* అప్లికేషన్ ప్రాసెస్
- ముందుగా ఐటీబీపీ అధికారిక పోర్టల్ recruitment.itbpolice.nic.in విజిట్ చేయాలి.
- హోమ్ పేజీలోకి వెళ్లి, ఐటీబీపీ కానిస్టేబుల్(కిచెన్ సర్వీసెస్) రిక్రూట్మెంట్-2024 అనే లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి.
- ఆ తరువాత ‘అప్లైనౌ’ అనే ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.
- ముందుగా పర్సనల్ వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.
- రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి.
- అన్ని వివరాలను ఎంటర్ చేసి, అప్లికేషన్ ఫిలప్ చేయాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.
- ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- చివరగా అప్లికేషన్ను సబ్మిట్ చేయాలి.
* అప్లికేషన్ ఫీజు
జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు ఉండదు.
* ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పలు దశల్లో ఉంటుంది. ముందుగా రాత పరీక్ష, ఆ తరువాత ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), డాక్యుమెంట్ వెరిఫికేషన్, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ (DME)/రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ (RME) వంటివి ఉంటాయి. అన్ని దశలను క్లియర్ చేసిన వారికి మాత్రమే పోస్టింగ్ ఉంటుంది.
* జీత భత్యాలు
ITBP కానిస్టేబుల్ (కిచెన్ సర్వీసెస్) ఉద్యోగానికి ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.21,700 నుంచి రూ. 69,100 మధ్య లభిస్తుంది. అలవెన్సులు, సౌకర్యాలు అదనంగా కల్పిస్తారు.
చెన్నామల్లయ్య.విలేజ్.కుంటపల్లి..మండల్...సంగం..వరంగల్..జిల్లా
ReplyDeleteHow to apply
ReplyDeleteHow to apply
ReplyDelete8019620975
ReplyDelete8019620975
ReplyDeleteHwo to apply
ReplyDeleteSsc 2014 th batch marks 477 nenu ee job ki apply cheskovachha..
ReplyDeleteSaritha
ReplyDeleteSsc 2004 th batch apply cheskovachha
ReplyDeleteSetti baboji
ReplyDeleteBala Krishna
ReplyDeleteHow to apply
ReplyDeleteKk
ReplyDeleteKk
ReplyDelete