నిరుద్యోగం అనేది ఎక్కడ చూసినా అత్యంత పెద్ద సమస్య. యువతకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. ఎంతో కష్టపడి చదువుకొని డిగ్రీ పాస్ అయినా తర్వాత సరైన ఉద్యోగాలు దొరక్క సమస్యల్లో ఉన్నవారు చాలామంది ఉన్నారు.
నిరుద్యోగం అనేది ఎక్కడ చూసినా అత్యంత పెద్ద సమస్య. యువతకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. ఎంతో కష్టపడి చదువుకొని డిగ్రీ పాస్ అయినా తర్వాత సరైన ఉద్యోగాలు దొరక్క సమస్యల్లో ఉన్నవారు చాలామంది ఉన్నారు. కొందరు అసలు తమ చదువుకు తగ్గ ఉద్యోగం చేయక దొరికిన ఏదో ఒక ఉద్యోగం తో బతుకు బండి లాగేస్తున్నారు.
కొంతమంది చిన్నా చితక ఉద్యోగాలు చేస్తున్నారు. అయినప్పటికీ కాంపిటీషన్ పెరిగిపోతోంది. ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా ఉద్యోగాలు సులభంగా దొరకటం లేదు.
నిరుద్యోగులు అటు సమాజం నుండి ఇటు కుటుంబ సభ్యుల నుండి కూడా అవమానాలు చీత్కరాలు ఎదుర్కొంటున్నారు. ఏం చేయాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. ఇంజినీరింగ్ డిగ్రీలు చేసిన వారు కూడా మెట్రో సిటీలకు వలస పోయి ఏ టాక్సీ నడపడం లేదా స్విగ్గి, జొమాటో డెలివరీ బాయ్స్ గా చేస్తున్నారు.
ఇలాంటి తరుణంలోనే మన ఉమ్మడి జిల్లా అనంతపురంలో ఉపాధ్యాయుల పోస్టులకు ఆహ్వానం అందింది. ఈ పోస్టులకు అనంతపురం జిల్లాలోని, సత్యసాయి జిల్లాలోని నిరుద్యోగులకు ఎంతో ఉపశమనం కలిగించే విషయం.
ఉమ్మడి జిల్లాలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ స్థానాలకు దరఖాస్తు చేసుకోవాలని గురుకులాల జిల్లా కో-ఆర్డినేటర్ మురళీకృష్ణ సూచించారు. జేఎల్, పీజీటీ, టీజీటీ, పీఈటీ, హెల్త్ సూపర్వైజర్ పోస్టులను డెమో ద్వారా, తాత్కాలిక ప్రాతిపదికన (గెస్ట్, పార్ట్ టైమ్) భర్తీ చేస్తామని తెలిపారు.
జేఎల్ కు పీజీ, బీఈడీ, టెట్ క్వాలిఫై సర్టిఫికెట్, పీజీటీకి పీజీ, బీఈడీ, టెట్ క్వాలిఫై సర్టిఫికెట్, టీజీటీకి డిగ్రీ, బీఈడీ, టెట్ క్వాలిఫై సర్టిఫికెట్ (టీజీటీ హిందీకి డిగ్రీతో పాటు పీజీటీ ఉండాలి), పీఈటీకి బీపీఎడ్, టెట్ క్వాలిఫై సర్టిఫికెట్, హెల్త్ సూపర్వైజర్ కి బీఎస్సీ నర్సింగ్ అర్హతలు ఉండాలని పేర్కొన్నారు.
ఆసక్తి కలిగిన వారు ఈ నెల 17న ఉదయం 11 గంటలకు కురుగుంట అంబేద్కర్ గురుకుల పాఠశాలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. బాలుర పాఠశాలలకు పురుషులు, బాలికల పాఠశాలల్లో మహిళలకు మాత్రమే ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
తిమ్మాపురం బాలికల పాఠశాల: టీజీటీ గణితం, టీజీటీ హిందీ, పీఈటీ.. నల్లమాడ బాలికల పాఠశాల: టీజీటీ భౌతికశాస్త్రం, పీఈటీ.. అమరాపురం బాలికల పాఠశాల: పీజీటీ ఇంగ్లిష్.. మలుగూరు బాలుర పాఠశాల: టీజీటీ హిందీ, టీజీటీ గణితం, టీజీటీ భౌతికశాస్త్రం.. బి. పప్పూరు బాలుర పాఠశాల: టీజీటీ హిందీ.. హిందూపురం బాలుర పాఠశాల: టీజీటీ హిందీ.. ఉరవకొండ బాలికల పాఠశాల: జేఎల్ సివిక్స్.. కణేకల్లు బాలుర పాఠశాల: హెల్త్ సూపర్వైజర్
No comments:
Post a Comment