ఎట్టకేలకు డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ విడుదలైంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ ఫలితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు మరో మూడు నాలుగు రోజుల్లోనే శుభవార్త చెప్పబోతోంది విద్యాశాఖ. వచ్చే వారంలోనే జిల్లాలవారీగా GRT జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేయబోతున్నారట. ఆపై 1:3 నిష్పత్తిలో మెరిట్ లిస్ట్ ఇచ్చి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయనున్నారు.
DSC అధికారిక వెబ్ సైట్ www.schooledu. telangana.gov.in లో స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు సంబంధించి వేర్వేరుగా తుది కీ అందుబాటులో ఉంది. తుది కీతోపాటు ఫైనల్ రెస్పాన్స్ షీట్ కూడా చూసుకునే సదుపాయం కల్పించారు. ప్రిలిమినరీ కీతో పోలిస్తే.. తుది కీలో సుమారు 109 ప్రశ్నలకు సంబంధించి జవాబులను మార్చినట్లు సమాచారం. 50 ప్రశ్నలకు జవాబులు సరిగ్గా లేకపోవడంతో వాటికి మార్కులను జత చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది మెగా డీఎస్సీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తం 11,062 టీచర్ల పోస్టుల భర్తీకి స్వీకారం చుట్టింది. ఇందులో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు.. 182 పీఈటీలు.. 6,508 ఎస్జీటీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ 220 స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. ఈ డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 87.61 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరంతా కూడా తుది ఫలితాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
డీఎస్సీ పరీక్షలో అభ్యర్థులకు వచ్చిన మార్కులు, టెట్లో వచ్చిన మార్కుల వెయిటేజిని కలిపి డిఎస్సీ తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి. అనంతరం జిల్లాల వారీగా మెరిట్ జాబితా ఇస్తారు. ఆపై 1:3లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి అందులోంచి ఒక్కరికి టీచర్ జాబ్ ఇస్తారు.
DSC
ReplyDeleteSocial Studies
ReplyDelete