తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కొలువులకు కొత్త దారి వేస్తోంది కాంగ్రెస్ సర్కార్. రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిరుద్యోగులకు సరైన న్యాయం జరుగుతుందని చెబుతూ వస్తున్న ప్రభుత్వం.. ఆ దిశగా అడుగులేస్తోంది. ప్రభుత్వ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయడానికి ఎప్పటికప్పుడు సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో యోగా ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఆయూష్ శాఖ నుంచి విడుదలైన ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా 842 యోగా ఇన్‌స్ట్రక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మొత్తం పోస్టుల్లో 421 పోస్టులను పురుష అభ్యర్థులకు, మరో 421 పోస్టులకు మహిళా అభ్యర్థులకు రిజర్వ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు https://ayush.telangana.gov.in/ వెబ్‌సైట్ లో అందుబాటులో ఉన్నాయి.
ఈ పోస్టులకు సెలెక్ట్ అయినవారు సెషన్ల వారీగా విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. యోగా ఇన్‌స్ట్రక్టర్లలో పురుషులు అయితే నెలకు కనీసం 32 యోగా సెషన్లకు అటెండ్ కావాలని.. మహిళలు అయితే నెలకు కనీసం 20 యోగా సెషన్లకు హాజరుకావాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ప్రతి సెషన్ గంటసేపు ఉంటుంది. ఒక్కో సెషన్‌కు రూ.250 చొప్పున రెమ్యునరేషన్ చెలిస్తారు.
వరంగల్ జోన్ లో నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో సెప్టెంబర్ 24వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 తేదీల మధ్య అభ్యర్థులకు ఇంటర్వూలు ఉంటాయి. విద్యార్హత, ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.