Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 31 January 2023

ఏపీలో 2480 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. 10వ తరగతి పాసైతే చాలు.. రాత పరీక్ష లేదు

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 40,889 Gramin Dak Sevak (GDS) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్ట ర్‌(బీపీఎం), అసిస్టెంట్‌బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.పది వేల నుంచి రూ.పన్నెండు వేల ప్రారంభ వేతనం ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 16 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం పోస్టుల్లో ఏపీలో 2480, తెలంగాణలో 1266 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్‌ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇంటెన్సివ్‌ ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్‌/ కంప్యూటర్‌/ స్మార్ట్‌ ఫోన్‌ లాంటివి పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ సమకూరుస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్‌ తొక్కడం రావాలి. పూర్తి వివరాల్లోకెళ్తే..

India Post GDS 2023 - మొత్తం ఖాళీలు: 40,889
సర్కిల్ వారీగా ఖాళీలు:

  • ఆంధ్రప్రదేశ్- 2480
  • అసోం- 407
  • బిహార్- 1461
  • ఛత్తీస్‌గఢ్- 1593
  • దిల్లీ - 46
  • గుజరాత్- 2017
  • హరియాణా- 354
  • హిమాచల్‌ ప్రదేశ్- 603
  • జమ్ము అండ్‌ కశ్మీర్- 300
  • ఝార్ఖండ్- 1590
  • కర్ణాటక- 3036
  • కేరళ- 2462
  • మధ్యప్రదేశ్- 1841
  • మహారాష్ట్ర- 2508
  • నార్త్ ఈస్టర్న్- 923
  • ఒడిశా- 1382
  • పంజాబ్- 766
  • రాజస్థాన్- 1684
  • తమిళనాడు- 3167
  • తెలంగాణ- 1266
  • ఉత్తర ప్రదేశ్- 7987
  • ఉత్తరాఖండ్- 889
  • పశ్చిమ్‌ బెంగాల్- 2127

1 comment:

Job Alerts and Study Materials