Mother Tongue

Read it Mother Tongue

Monday, 30 January 2023

TSPSC కీలక ప్రకటన.. ఉద్యోగ నియామక పరీక్ష తేదీలు వెల్లడి.. ఏ పరీక్ష ఎప్పుడంటే..?

 TSPSC కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేసిన పలు ఉద్యోగ నియామక పరీక్షల తేదీలను తాజాగా ప్రకటించింది. ఏప్రిల్‌ 25న అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ నియామక పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. మే 7న డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ నియామక పరీక్ష, మే 13న పాలిటెక్నిక్‌ లెక్చరర్ల నియామక పరీక్ష, మే 17న ఇంటర్‌, సాంకేతిక విద్యా శాఖల్లో ఫిజికల్‌ డైరెక్టర్‌ నియామక పరీక్ష నిర్వహించనున్నట్లు TSPSC పేర్కొంది. అన్ని పరీక్షలను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు. మరోవైపు అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల దరఖాస్తుల గడువును పొడిగిస్తూ TSPSC నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 2 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు స్పష్టం చేసింది.

1 comment:

  1. Plz correct, April 25th AGRICULTURE OFFICER exam, not Agriculture extension officer exam.

    ReplyDelete

Job Alerts and Study Materials