తెలంగాణ రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ లో ఖాళీగా ఉన్న 2050 నర్సింగ్ ఆఫీసర్స్ (స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
నిరుద్యోగ సమస్యపై ఫోకస్ పెట్టిన తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్.. ప్రభుత్వ శాఖల్లో పోస్టుల భర్తీకి పలు నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ లో ఖాళీగా ఉన్న 2050 నర్సింగ్ ఆఫీసర్స్ (స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ లో 1576 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అదేవిధంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 332 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను కూడా భర్తీ చేయబోతున్నారు. వీటితో పాటు ఆయుష్ శాఖలో 61, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో 80 మంది నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో ఒక నర్సింగ్ ఆఫీసర్ పోస్టు కూడా భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు గాను సెప్టెంబర్ 28 నుంచి ఆన్ లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్స్ సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 14. అర్హులైన అభ్యర్థులు బోర్డు వెబ్సైట్ https://mhsrb.telangana.gov.in దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 17న CBT విధానంలో పరీక్ష ఉంటుంది.
Setti baboji
ReplyDeleteSetti baboji dara konda
ReplyDeleteOk but not sure...
ReplyDeletePlease tel me dmst vacancecy
ReplyDelete