Mother Tongue

Read it Mother Tongue

Sunday, 1 September 2024

దివ్యాంగులకు ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి!

దివ్యాంగులకు ఉద్యోగాలు.. ముందుగా శిక్షణకు 10 వ తరగతి పాస్ / ఫెయిల్ ఆ పైన చదువు, వయస్సు 18 నుండి 32 సం. వరకు గల 40 శాతం వికలత్వంతో సదరం సర్టిఫికేట్ కలిగిన వారు అర్హులు.
చిత్తూరు, తిరుపతి జిల్లాలో గల దివ్యాంగులకు డ్రీం ఫౌండేషన్ ద్వారా తిరుపతిలో శిక్షణా కేంద్రాన్ని స్థాపించి అందులో వివిధ రకాల కోర్సులలో వారికి ఉచిత శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.  దివ్యాంగుల కొరకు ఈ క్రింది కోర్సులలో శిక్షణ1) బి.పి.ఓ (కాల్ సెంటర్)2) కంప్యూటర్ అసిస్టెంట్, డి.టి.పి., మ్యాసుఫ్యాక్టరింగ్3) రిటైల్, హోటల్ మేనేజ్ మెంట్, ఈ కామర్స్4) స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణా తరగతులు5) టైపింగ్, పర్సనల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇవ్వనున్నారు.
శిక్షణకు 10 వ తరగతి పాస్ / ఫెయిల్ ఆ పైన చదువు, వయస్సు 18 నుండి 32 సం. వరకు గల 40 శాతం వికలత్వంతో సదరం సర్టిఫికేట్ తో సెప్టెంబర్ 4వ తేదిన తిరుపతిలోని రాస్ కార్యాలయము, ఎయిర్ బైపాస్ రోడ్, తిరుపతి లో ఉద్యోగాలు కొరకు విభిన్న ప్రతిభావంతులు, హాజరు కావాల్సిందిగావిభిన్న ప్రతిభావంతులు, హిజ్రా మరియు వయోవృద్ధుల సంకేమ శాఖ అధికారి, సహాయ సంచాలకులు ఏ. వై. శ్రీనివాస్ చిత్తూరు వారు ఒక ప్రకటనలో తెలిపారు.
ఉమ్మడి జిల్లా దివ్యాంగులకు డ్రీం ఫౌండేషన్ వారు గుడ్ న్యూస్ చెప్పారు. వారి సామర్థ్యానికి తగ్గట్టు జాబ్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నారు.మరన్ని వివరాలకు తిరుపతిగల దివ్యాంగులకు డ్రీం ఫౌండేషన్ శిక్షణా కేంద్రాన్ని సంప్రదించవచ్చు.


6 comments:

Job Alerts and Study Materials