Mother Tongue

Read it Mother Tongue

Friday, 20 September 2024

LICలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్.. ఇదిగో ఫుల్ డీటెయిల్స్

 ప్రస్తుతం దేశాన్ని నిరుద్యోగ సమస్య వెంటాడుతోంది. చదువు పూర్తి చేసిన ఎంతోమంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల కోసం ఎంతగానో సెర్చ్ చేస్తున్నారు. చిన్న జాబ్ నోటిఫికేషన్‌ విడుదలైనా లక్షల్లో పోటీ పడుతున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా సత్తా చాటాలని ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారందరి కోసం LICలో పలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Life Insurance Corporation of India) లో వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ జాబ్‌ లేదా ఫుల్‌ టైమ్‌ కూడా చేసుకునే అవకాశం ఉంది. ఎల్ఐసీ సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేయబోతోంది. మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. పైగా ఇంటి వద్ద ఉండే పని చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు విద్యార్థత ఇంటర్ మాత్రమే. ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. మార్కెటింగ్ స్కిల్స్ అవసరం. అభ్యర్థుల కనీస వయసు 18 సంవత్సరాలు. అర్హులైన స్త్రీ, పురుషులు ఎవ్వరైనా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. వచ్చిన అప్లికేషన్స్‌ను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్య్వూ ద్వారా ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 8వ తేదీ దరఖాస్తు చేసుకోవచ్చు.



12 comments:

Job Alerts and Study Materials