Mother Tongue

Read it Mother Tongue

Sunday, 8 January 2023

శాతవాహనులు

మూలపురుషుడు : శాతవాహనుడు

స్థాపకుడు : సిముఖుడు

రాజదాని : 1) ధాన్యకటకం, 2) పైఠాన్ ప్రతిష్టానపురం

రాజలాంచనం : సూర్యుడు

మతం : జైనం, హైందవం

అధికార భాష ప్రాకృతం

శాతవాహనులు – శాసనాలు

నానాఘాట్ శాసనం : నాగానిక (మొదటి శాతకర్ణి గురించి)

నాసిక్ శాసనం : గౌతమీ బాలశ్రీ (గౌతమీపుత్ర శాతకర్ణి గురించి)

మ్యాకధోనీ శాసనం : మూడవ పులోమావి (శాతవాహన వంశ పతనం గురించి)

జునాగఢ్/గిర్నార్ : రుద్రదాముడు (మొదటి సంస్కృత శాసనం)

హాతిగుంఫ శాసనం : ఖారవేలుడు

ఎర్రగుడి శాసనం (కర్నూలు) : అశోకుడు

శాతవాహన పాలకులు, వారి రాజకీయ చరిత్ర

 1. శ్రీ ముఖుడు : శాతవాహన రాజ్య స్థాపకుడు. ప్రతిష్టానపురం రాజధానిగా అధికారంలోకి వచ్చాడు. ఇతని తండ్రి శాతవాహనుడు. ఇతని నాణాలు కోటిలింగాల (కరీంనగర్లో), శాతవాహనుడి నాణాలు కొండాపూర్‌లో లభ్యము.

2. కృష్ణుడు (కణ్పడు) : కచేరి, నాసిక్ గుహలను తవ్వించాడు. నాసిక్ లో బౌద్ధ సన్యాసుల సంక్షేమం కొరకు “ధర్మ మహామాత్య” అనే అధికారులను నియమించారు. ఇతని కాలంలోనే భాగవత మతం దక్కణ్ లో ప్రవేశించింది.

3. శాతకర్ణి -1 : శాతవాహన వంశానికి నిజమైన స్థాపకుడు. మొదటి శాతకర్ణి పుష్యమిత్ర శుంగుడిని ఓడించినందుకు గుర్తుగా నాణాలపై ఉజ్జయిని పట్టణ గుర్తును ముద్రించాడు. వైదిక యజ్ఞ యాగాలు నిర్వహించిన మొదటి రాజు – శాతకర్ణి-I. ఇతను తొలిసారిగా బ్రాహ్మణులకు పన్ను మినహాయింపు భూములను దానంగా ఇచ్చాడు.

4. శాతకర్ణి-2 : ఇతను అత్యధికంగా 56 సం,,లు పాలించాడు. ఇతను సాంచి స్థూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించాడు. ఇతని శాసనం సాంచి (విదిశ దగ్గర)లో లభించింది. ఇతని ఆస్థాన కళాకారుడు – వశిష్టపుత్ర ఆనంద.

5. కుంతల శాతకర్ణి : ఇతని కాలంలో సంస్కృతం శాతవాహనుల అధికార భాషగా మారింది. (అప్పటి వరకు ప్రాకృతం అధికార భాషగా ఉండేది). ఇతని ఆస్థానంలో శర్వవర్మ, గుణాఢ్యుడు ఉన్నారని పేర్కొంటారు. శర్వవర్మ-కాతంత్ర వ్యాకరణం (సంస్కృత వ్యాకరణ గ్రంధం). గుణాఢ్యుడి-బృహత్కథ (పైశాచిక భాష) విష్ణుశర్మ పంచతంత్రాన్ని రచించుటకు ఆధారమైనది. శర్వవర్మ, గుణాఢ్యుడి మధ్య ఏర్పడిన సవాలు గూర్చి వివరించిన గ్రంథం సోమదేవుడి “కథాసరిత్సాగరం . కుంతల శాతకర్ణి భార్య “మలయావతి” కరిర్త అనే కామక్రీడ వలన మరణించింది.

6. హాలుడు : ఆంధ్రుల చరిత్రలో తొలి కవిరాజు. తన సాహిత్యం వల్ల హాలుడు కవివత్సలుడు అనే బిరుదు పొందాడు. ఈ ఇతను ప్రాకృతంలో గాధా సప్తశతి (మహారాష్ట్ర ప్రాకృతం) ని సంకలనం చేశాడు. ఇతను శ్రీలంక రాకుమార్తె లీలావతిని సప్త గోదావరిలో వివాహమాడాడు. ఈ వివహం పై కుతూహలుడు లీలావతి పరిణయం (ప్రాకృతం) రంగాన్ని రచించారు.

7. శాతవాహనులు – గౌతమీపుత్ర శాతకర్ణి : శాతవాహనుల్లో అతి గొప్పవాడు. ఇతను అధికారంలోకి రావడంతో శాలివాహన శకం (క్రీ.శ.78) ప్రారంభమైంది. 1957 నుండి క్రీ.శ 78 వ సం||ను భారత ప్రభుత్వం అధికారికంగా శాలివాహన శకారంభ సంవత్సరంగా పాటిస్తున్నది. శాలివాహన శకంను పాటించిన ఏకైక రాజు “యాదవ రామచంద్ర దేవుడు” (దేవగిరి రాజు). ఇతని గొప్పతనం గూర్చి ఇతని తల్లి గౌతమి బాలశ్రీ వేయించిన – నాసిక్ శాసనం తెలియజేస్తుంది, ఇతను నహపానుడి వెండి నాణాలను తన చిహ్నాలతో తిరిగి ముద్రించాడు. ఈ నాణాలు “కడలూరు” (జోగల తంబి)లో కనుగొనబడ్డాయి. ఇతను వైదిక సంప్రదాయాలను పాటిస్తూ బౌద్ధ మతాన్ని కూడా ఆదరించాడు. బౌద్ధ భిక్షువులకు 100 నివర్తనాల భూమిని దానం చేశాడు. బౌద్ధ శాఖ అయిన భద్రనేయ అనే శాఖకు నాసిక్ లో గుహలను ఇచ్చాడు. ఇతని నాణెములు కొండాపూర్, పెదబంకూరులలో పెద్దసంఖ్యలో లభించాయి. శాతవాహనుల రాజులలో తన పేరు మీద మొదట శాసనాలు వేయించిన రాజు ఇతడే.

8. పులోమావి-2 (వశిష్ట పుత్ర పులోమావి) : ఇతని కాలంలో గౌతమీ బాలశ్రీ నాసిక్ శాసనాన్ని (ప్రాకృతం) వేయించింది. ఇతని కాలంలోనే రాజధానిని ప్రతిష్టానపురం నుండి అమరావతికి మార్చడం జరిగింది. ఇతని కాలంలో అమరావతి స్థూపం నిర్మించబడింది. ఇతడు కార్లేలో బౌద్ధ సన్యాసులకు విరాళాలు ఇచ్చాడు.

9. యజ్ఞశ్రీ శాతకర్ణి : శాతవాహన వంశంలో చివరి గొప్పవాడు. ఇతని కాలంలోనే మత్స్యపురాణం సంకలనం చేయబడింది. ఇతను నాగార్జునునికి శ్రీపర్వతం (నాగార్జున కొండ)పై పారావత విహారం నిర్మించాడు. రెండు తెరచాపల నౌక బొమ్మ గల నాణాలు ముద్రించాడు.  ( ప్రారంభించింది పులోమావి-2). బాణుడు హర్ష చరిత్రలో ఇతనిని “త్రిసముద్రా ధీశ్వరుడు” అని పేర్కొన్నాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి చినగంజాం (ప్రకాశం) శాసనాన్ని వేయించాడు. ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీని ఉద్దేశిస్తూ ‘సుహృల్లేఖ”ను రచించాడు.

10. మూడవ పులోమావి : శాతవాహనుల యొక్క చివరి పాలకుడు. ఇతని సేనాపతి అయిన శ్రీశాంత మూలుడు తిరుగుబాటు చేయడంతో రాజ్యాన్ని వదిలి బళ్ళారి పారిపోయి అక్కడ నుండి కొంతకాలం పాలించాడు. ఇతను బళ్ళారిలో ‘మ్యాకదోని శాసనాన్ని‘ వేయించాడు. మ్యాకదోని శాసనం శాతవాహన రాజ్య పతనం గురించి వివరిస్తుంది.


4 comments:

  1. 𝓢𝓾𝓸𝓮𝓻

    ReplyDelete
  2. Next inka important topics kuda cheppandi sir

    ReplyDelete
  3. I want pdf of TS HISTORY

    ReplyDelete
  4. Please give English Medium notes sir

    ReplyDelete

Job Alerts and Study Materials