ఏపీలో కొలువుల జాతర స్టార్ట్ కానుంది. రానున్న మూడు నెలల్లో ఏకంగా 20 జాబ్ నోటిఫికేషన్లను విడదుల చేయడానికి జగన్ సర్కార్ సిద్ధమవుతోంది. ఏపీలోని సీఎం జగన్ సర్కార్ నిరుద్యోగులకు వరుసగా శుభవార్తలు చెప్పేందుకు సిద్ధమైంది. భారీగా నోటిఫికేషన్లు విడుదల చేయడానికి కసరత్తు చేస్తోంది. మొత్తం 20 నోటిఫికేషన్లను విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. రానున్న మూడు నెలల్లో ఈ నోటిఫికేషన్లు విడుదల చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు అధికారులు. ఈ నోటిఫికేషన్లలో గ్రూప్-1, గ్రూప్-2 తో పాటు డిగ్రీ కాలేజీల లెక్చరర్లు, ఇంజనీర్లు తదితర పోస్టులు ఉన్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రారంభమైన 111 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీని ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇంకా.. గ్రూప్-4 ఫలితాలను సైతం ఈ నెల 3 వారంలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు అధికారులు. అనంతరం వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేయాలనన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. 140 పోస్టులతో గ్రూప్ -1, 1000 పోస్టులతో గ్రూప్ 2 ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయనున్నారు. ఇంకా భారీగా లెక్చరర్ ఉద్యోగాలను సైతం భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 400 డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంకా జూనియర్ లెక్చరర్ల ఉద్యోగాలను సైతం భర్తీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఏపీపీఎస్సీ సిద్ధం అవుతోంది. ఇంకా.. పంచాయితీ రాజ్, ఇరిగేషన్ తదితర శాఖల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టులకు సైతం నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఇంకా వీటితో పాటు భారీగా టీచర్ ఉద్యోగాలను సైతం భర్తీ చేయనున్నారు. ఎన్నికల నాటికి భారీగా ఉద్యోగాల భర్తీగా చేపట్టాలన్నది జగన్ సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది.

No comments:
Post a Comment