పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 1,358 పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టుల్లో ప్రిన్సిపల్ పోస్టులు 92 ఉండగా.. పీజీటీ 846, సీఆర్టీ 374, పీఈటీ 46 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిని పూర్తిగా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తారు. వీటికి దరఖాస్తు పీజు కింద రూ.100 చెల్లించాలి. మే 29 నుంచి జూన్ 04 వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వీటికి సమగ్ర నోటిఫికేషన్ ను http://apkgbv.apcfss.in/ వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్ అభ్యర్థులకు 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.

No comments:
Post a Comment