ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవల్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలో మరో సారి భారీ జాబ్ మేళాలను నిర్వహిస్తోంది. ఈ నెల 19న మరో భారీ జాబ్ మేళాను (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళా ద్వారా పది ప్రముఖ సంస్థల్లో 800లకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Mela Registration) చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 19న అరకు వ్యాలీలో ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. నవత రోడ్ ట్రాన్స్ పోర్ట్: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఆపై విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.16 వేల వరకు వేతనం ఉంటుంది.
అపోలో ఫార్మసీ: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీ/ఎం/డీ ఫార్మసీ విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల వరకు వేతనం ఉంటుంది.
పేటీఎం: ఈ సంస్థలో 30 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఆపై విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేలకు పైగా వేతనం ఉంటుంది. డెక్కన్ కెమికల్స్: ఈ సంస్థలో 150 ఖాళీలు ఉన్నాయి. బీఎస్సీ కెమిస్ట్రీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.19,744 వరకు వేతనం ఉంటుంది.
హెటెరో డ్రగ్స్: ఈ సంస్థలో 20 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల వేతనం ఉంటుంది.
ముత్తూట్ ఫైనాన్స్: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. ప్రొబేషనరీ ఆఫీసర్/ఇంటర్న్ షిప్ ట్రైనీ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, పీజీ చేసిన వారికి అవకాశం ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.18 వేల వరకు వేతనం ఉంటుంది.
ముఖ్యమైన లింక్స్
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment