నిరుద్యోగులకు దక్షిణ రైల్వే (Southern Railway) శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే అంటే ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు నెల రోజుల సమయం ఇచ్చారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 5లోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.44,900 వేతనం చెల్లించనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి.
ఉద్యోగ ఖాళీలు 28
- నోటిఫికేషన్లో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 28 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ముఖ్యమైన తేదీలు
- మే 05, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- జూన్ 04, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు (Aprax)
విద్యార్హత
- బీఎస్సీ నర్సింగ్ చేసిన విద్యార్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
వయోపరిమితి
- పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 42 ఏళ్లలోపు ఉండాలి
- SC/ST మరియు OBC అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు
- ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
ముఖ్యమైన లింక్స్
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment