తెలంగాణలో ఇప్పటికే అనేక ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి అన్న విషయం తెలిసిందే. వీటికి సంబంధించి పరీక్షలు కూడా పూర్తయ్యాయి. మరికొన్ని నియామకాలకు సంబంధించి పరీక్షలు జరగనున్నాయి. అయితే వీటితో పాటు.. మరో 1982 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మన ఊరు-మన బడి, మన బస్తీ పాఠశాలలకు నైట్ వాచ్మెన్లు (Night Watchman) నియమించేందుకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని తాత్కాళిక ప్రాతిపదికన నియమించనున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునీకరణ, స్కూళ్లలో 12 రకాల మౌళిక సదుపాయల కల్పనకు పటిష్ట చర్యలు తీసుకోనున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఈ స్కీమ్‌ను మన ఊరు-మన బడి పేరుతో అమలు చేస్తుండగా, పట్టణ ప్రాంతాలలో మన బస్తి-మన బడి పేరుతో అమలు చేస్తున్నారు. పాఠశాలల్లో ఉండే విలువైన పరికరాలు, సామగ్రికి రక్షణ లేకుండా పోవడంతో ఈమేరకు ఆయా పాఠశాలలకు నైట్ వాచ్మెన్లను నియమించనున్నారు. విటిని సురక్షితంగా కాపాడే బాధ్యత ఈ నైట్ వాచ్ మెన్లకు ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1982 పాఠశాలల్లో వీరిని నియమించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఉత్తర్వుల్లో తెలిపారు. అయితే వీరికి నెలకు రూ.5వేలు గౌరవ వేతనం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా.. నియామకాలు జరపాలని, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ద్వారా వాచ్మెన్లనియామకం చేపట్టాలని సూచించారు. తక్షణమే ఈ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులు పేర్కొన్నారు.

No comments:
Post a Comment