హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని సశస్త్ర సీమా బల్ (SSB) పోలీస్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1656 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ మొత్తం ఖాళీల్లో అసిస్టెంట్ కమాండెంట్, సబ్ ఇన్ స్పెక్టర్, ఏఎస్ఐ (పారామెడికల్ స్టాఫ్). ఏఎస్ఐ (స్టెనో), హెడ్ కానిస్టేబుల్ (HC), కానిస్టేబుల్ (ట్రేడ్స్ మెన్) తదితర పోస్టులు ఉన్నాయి.
ఉద్యోగ ఖాళీలు 1656
- అసిస్టెంట్ కమాండెంట్ (వెటర్నరీ) 18
- సబ్ ఇన్ స్పెక్టర్ (టెక్) 111
- ఏఎస్ఐ (పారామెడికల్ స్టాఫ్) 30
- ఏఎస్ఐ (స్టెనో) 40
- హెడ్ కానిస్టేబుల్ (HC) 914
- కానిస్టేబుల్ (ట్రేడ్స్ మెన్) 543
ముఖ్యమైన తేదీలు
- మే 25, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- జూన్ 24, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
దరఖాస్తు రుసుము
- దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు రూ.100ను ఎగ్జామ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
- ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్ మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు.
విద్యార్హత
- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. పోస్టుల ఆధారంగా టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హతలకు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు.
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment