తెలంగాణలో 8039 గ్రూప్-4 ఖాళీల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం ముగియగా.. మొత్తం 9లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 30 తో ముగియగా.. మరో నాలుగు రోజులు పొడిగించిన విషయం విధితమే. అయితే చాలామంది అభ్యర్థులు గ్రూప్ 4 దరఖాస్తుల ప్రక్రియలో తప్పులు దొర్లినట్లు టీఎస్పీఎస్సీకి వినతులు సమర్పించారు. అయితే.. తాజాగా వీటిపై స్పందిస్తూ టీఎస్పీఎస్సీ దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ కు అవకాశం కల్పించింది. దీనిని మే 09 నుంచి మే 15 వరకు చేసుకోవచ్చని తెలిపింది. అంటే వారం రోజులు ఎడిట్ కు అవకాశం కల్పించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులో తప్పులను సరిదిద్దుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు. అయితే.. ఎడిట్ కు ఒక్కసారి మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ వెబ్ నోట్ లో పేర్కొంది. ఇక గ్రూప్ 4 పరీక్ష తేదీని మూడు నెలల క్రితమే ప్రకటించింది. జూలై 01న ఈ పరీక్ష నిర్వహించనుండగా.. దీనిని వాయిదా వేయాలని.. టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల వ్యవహారంతో.. తామంతా ఆందోళన చెందామని.. ప్రపరేషన్ కు కాస్త సమయం ఎక్కువ ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. గ్రూప్ 4 కు గ్రూప్ 2 మధ్య కనీసం మూడు నెలల సమయం ఇవ్వాలని. గ్రూప్ 1 కు.. గ్రూప్ 4 మధ్య కూడా రెండు నెలల సమయం ఇవ్వాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. జనవరి 27న తెలంగాణ(Telangana) ఆర్థిక శాఖ 2,391 పోస్టులకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైన గ్రూప్ – 3, 4 లలో పోస్టుల సంఖ్య పెరిగాయి. టీఎస్పీఎస్సీ ఇప్పటికే గ్రూప్-3, 4 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసి.. దరఖాస్తులను కూడా ఆహ్వానించింది. వీటితో గ్రూప్ 2 పరీక్ష తేాదీని ప్రకటించింది టీఎస్పీఎస్సీ. ఆగస్టు 29, 30వ తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. అయితే.. అభ్యర్థులు మాత్రం ఈ పరీక్షను కూడా వాయిదా వేయాలని కోరుతున్నారు.
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో ఎడిట్ ఆప్షన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- ఎడిట్ ఆప్షన్ పిడిఎఫ్ ఫైల్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
.png)
No comments:
Post a Comment