స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 2023-24 సంవత్సారానికి సంబంధించి ‘కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్-2023’ (SSC CHSL Recruitment 2023) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1600 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైన సంస్థల్లో ఈ 1600 ఖాళీలు (Jobs) ఉన్నాయి. లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ (గ్రేడ్-ఎ) తదితర పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
ఉద్యోగ ఖాళీలు 1600
- లోయర్ డివిజనల్ క్లర్క్
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
- డేటా ఎంట్రీ ఆపరేటర్స్ (గ్రేడ్-ఎ) తదితర పోస్టులు
ముఖ్యమైన తేదీలు
- మే 09 09, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- జూన్ 08, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
- ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చేయడానికి చివరి తేదీ మరియు సమయం 10-06-2023 (23:00)
దరఖాస్తు రుసుము
- జనరల్ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది
- మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపులో మినహాయింపు ఇచ్చారు
విద్యార్హత
- అభ్యర్థులు తప్పనిసరిగా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి లేదా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుంచి అందుకు సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి
- కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి
- గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు లోపు ఉండాలి
- ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment