Mother Tongue

Read it Mother Tongue

Sunday, 28 May 2023

AP Teacher Jobs 2023: ఏపీలో 1358 టీచర్ జాబ్స్ కు నోటిఫికేషన్.. దరఖాస్తులు ఈ రోజు నుంచే.. వివరాలివే!

ఏపీలోని నిరుద్యోగులకు సీఎం జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (AP KASTURBA GANDHI BALIKA VIDYALAYA) భారీగా ఉద్యోగాల (AP Jobs) భర్తీకి అధికారులు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ వారి నుంచి ఈ నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 1358 టీచర్‌ (ప్రిన్సిపాల్, పీజీటీ, సీఆర్‌టీ, పీఈటీ) ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. అయితే.. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎలా అప్లై చేయాలంటే: అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 29 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 4ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు రాత్రి 11:59 గంటలలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. http://apkgbv.apcfss.in/ వెబ్ సైట్లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

ఉద్యోగ ఖాళీలు 1358

  1. ప్రిన్సిపాల్ పోస్టులు 92
  2. పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ) పోస్టులు 846
  3. సీఆర్‌టీ పోస్టులు 374
  4. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌(పీఈటీ) పోస్టులు 46

ముఖ్యమైన తేదీలు

  1. మే 29, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
  2. జూన్ 04, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు

దరఖాస్తు రుసుము

  1. 100

విద్యార్హత

  1. సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అయితే.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుక కేవలం మహిళా అభ్యర్ధులు మాత్రమే అర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు అధికారులు.

వయోపరిమితి

  1. ఈ ఉద్యోగాలకు 18-42 ఏళ్లను వయో పరిమితిగా విధించారు. వివిధ వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. ఎస్సీ/ ఎస్టీ/ బీసీలకు అయిదేళ్లు, మాజీ సైనిక ఉద్యోగులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.

ముఖ్యమైన లింక్స్

  1. ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  2. నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  3. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

No comments:

Post a Comment

Job Alerts and Study Materials