గ్రూప్ -1 పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC Group-1 Hall Tickets) ఈ రోజు విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలో గ్రూప్-1 నియామకాలకు సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ రోజు నుంచి కమిషన్ అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in/ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ పరీక్షలను జూన్ 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ప్రతీ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించనున్నారు. 10 జిల్లా కేంద్రాల్లో ఈ ఎగ్జామ్ ను నిర్వహించేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆఖరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా సాధ్యమైనంత త్వరగా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఏపీలో 111 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీకి జనవరి 8న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. ఫలితాలను జనవరి 27న టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షకు మొత్తం 87,718 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 6,455 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో ఎంపిక చేశారు. వాస్తవానికి 1:50 నిష్పత్తి ప్రకారం 5,550 మందిని మాత్రమే మెయిన్స్ కు ఎంపిక చేయాల్సి ఉంది.
ముఖ్యమైన లింక్స్
- హాల్ టికెట్ డౌన్లోడ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment