రాష్ట్రంలోని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గజగిరిగుట్ట దిగువన
మట్టి దిబ్బల కింద శాతవాహన కాలం నాటి ఇటుక గోడల నిర్మాణాలను చరిత్ర
పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి మే 3న కనుగొన్నారు. రైతులు సాగు కోసం
తవ్వడంతో ఇటుక గోడల వరుసలు వెలుగు చూశాయి. ఉపరితలంలో బౌద్ధ స్థూప
నిర్మాణానికి సంబంధించిన శిలలు, సున్నపురాయి, మట్టితో చేసిన టైల్స్
బయల్పడ్డాయి. రంగురంగుల రాతి, దంతపు, మట్టి పూసలు, మట్టి, రాతి గోళీలు, శివ
లింగ ఆకృతిలోని పనిముట్లు లభించాయి. కొన్నె, రామచంద్రాపూర్ గ్రామాల మధ్య
సుమారు 2 వేల సమాధులు ఉన్నాయి. నిలువురాళ్ల సమాధులు, గూడు సమాధులు, రంధ్రం
ఉన్న సమాధులు, గుంత సమాధులు, రాక్షస గూళ్లు, డోల్మెన్ సమాధులతో పాటు కుండ
సమాధులు ఉన్నాయి.
No comments:
Post a Comment