నిరుద్యోగులకు గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అప్లికేషన్ లింక్ మే 10న యాక్టివేట్ చేయబడింది. గుజరాత్ మెట్రో యొక్క ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జూన్ 9, 2023గా నిర్ణయించింది. చివరి తేదీకి ముందు సూచించిన ఫార్మాట్‌లో ఫారమ్‌ను పూరించాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ ఈ పోస్టులకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మాత్రమే చేయవచ్చు. దీని కోసం.. మీరు GMRC అధికారిక వెబ్‌సైట్‌కి gujaratmetrorail.com వెళ్లాలి. ఏ ఇతర మాధ్యమం ద్వారా చేసిన దరఖాస్తు అంగీకరించబడదు. ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ స్థానం అహ్మదాబాద్ లో ఉంటుంది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటాయి. ప్రస్తుతం 5 సంవత్సరాల వరకు ఈ కాంట్రాక్ట్ విధానం ఉండనుంది.
ఉద్యోగ ఖాళీలు
- స్టేషన్ కంట్రోలర్/ట్రైన్ ఆపరేటర్ - 150 పోస్టులు
- కస్టమర్ రిలేషన్ అసిస్టెంట్ (CRA) - 46 పోస్టులు
- జూనియర్ ఇంజనీర్ - 31 పోస్టులు
- జూనియర్ ఇంజనీర్ - ఎలక్ట్రానిక్స్ - 28 పోస్టులు
- జూనియర్ ఇంజనీర్ - మెకానికల్ - 12 పోస్టులు
- జూనియర్ ఇంజనీర్ - సివిల్ - 06 పోస్టులు
- మెయింటెయినర్ - ఫిట్టర్ - 58 పోస్టులు
- మెయింటెయినర్ - ఎలక్ట్రికల్ - 60 పోస్టులు
- మెయింటెయినర్ - ఎలక్ట్రానిక్స్ - 33 పోస్టులు
ముఖ్యమైన తేదీలు
- మే 10, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- జూన్ 09, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
దరఖాస్తు రుసుము
- జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.600 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
- అయితే OBC అభ్యర్థులు రూ. 300 ఫీజు చెల్లించాలి
- ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.150 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
వయోపరిమితి
- కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి
- గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు లోపు ఉండాలి
- రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది
ఎంపిక
- ఈ పోస్టులకు దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో ఉంటుంది. దరఖాస్తుల ప్రక్రియకు చివరి తేదీ జూన్ 9గా నిర్ణయించారు. వీటికి రాత పరీక్ష మరియు గుజరాత్ భాషా పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. పరీక్ష తేదీ ఇంకా స్పష్టంగా తెలియజేయలేదు. కానీ జూలై నెలలో పరీక్ష జరిగే అవకాశం ఉంది.
ముఖ్యమైన లింక్స్
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment