తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనవి. ఈ నోటిఫికేషన్ ద్వారా 148 అగ్రికల్చర్ ఆఫీసర్(Agriculture Officer) పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే తాజాగా టీఎస్పీఎస్సీ ఈ నోటిఫికేషన్ కు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చింది. అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత హాల్ టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.
అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు CBRT పరీక్ష 16/05/2023న షెడ్యూల్ చేయబడింది. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు మొదటి పేపర్.. మధ్యాహ్నం 02:30 PM నుండి 05:00 PM సెకండ్ పేపర్ నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించి అడ్మిట్ కార్డులు కమిషన్ వెబ్‌సైట్‌లో https://www.tspsc.gov.in నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ హాల్ టికెట్స్ పరీక్ష ప్రారంభానికి 45 నిమిషాల ముందు అంటే.. 16/05/2023 రోజున ఉదయం 9.15 వరకు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంటాయి.
ముఖ్యమైన లింక్స్
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment