రాష్ట్ర హైకోర్టు
భారత రాజ్యాంగంలోని VIవ భాగంలో ప్రకరణలు 214 నుంచి 231 వరకు రాష్ట్ర స్థాయిలో గల హైకోర్టులు, వాటి నిర్మాణం, అధికార విధుల గురించి పేర్కొన్నారు.
ప్రకరణ 214 ప్రకారం ప్రతి రాష్ట్రంలో ఒక హైకోర్టు ఉంటుంది. హైకోర్టు రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం.
ప్రకరణ 231 ప్రకారం రెండు (లేదా) అంతకంటే ఎక్కువ రాష్ర్టాలకు పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేస్తుంది.
7వ రాజ్యాంగ సవరణ (1956) ద్వారా రెండు (లేదా ) అంతకన్నా ఎక్కువ రాష్ర్టాలు (లేదా) కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి ఒక ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేసే అధికారం పార్లమెంట్‌కు సంక్రమించింది
ప్రకరణ 230 ప్రకారం పార్లమెంట్ ఒక శాసనం ద్వారా హైకోర్టు పరిధిలోకి కేంద్రపాలిత ప్రాంతాన్ని చేర్చవచ్చు (లేదా) తొలిగించవచ్చు
ప్రస్తుతం కింది రాష్ర్టాలకు ఉమ్మడి హైకోర్టులు ఉన్నాయి. అవి…
1. మహారాష్ట్ర, గోవా
2. హర్యానా, పంజాబ్
3. అసోంతోపాటు నాగాలాండ్, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్
కేంద్రపాలిత ప్రాంతాలు సమీప రాష్ర్టాల హైకోర్టు పరిధిలోకి వస్తాయి. అయితే సొంత హైకోర్టు కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు..
1. ఢిల్లీ 2. జమ్ముకశ్మీర్
హైకోర్టుల చట్టం) 1861 ప్రకారం దేశంలో మొట్టమొదటిసారి హైకోర్టులను కలకత్తా (1862, జూలై 1), బొంబాయి (1862, ఆగస్టు 14), మద్రాసు (1862, ఆగస్టు 15)లలో ఏర్పాటు చేశారు. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌లో కొత్త హైకోర్టును ఏర్పాటు చేశారు. దీంతో ప్రస్తుతం 25 హైకోర్టులు ఉన్నాయి.
నోట్: ఇటీవల 150 ఏండ్లు పూర్తిచేసుకున్న హైకోర్టులు.. కలకత్తా, బొంబాయి, మద్రాసు
కలకత్తా హైకోర్టును గతంలో హైకోర్టు ఆఫ్ జ్యుడికేచర్ ఎట్ ఫోర్ట్ విలియం అని పిలిచేవారు.
కలకత్తా, బొంబాయి, మద్రాస్ హైకోర్టుల తర్వాత అలహాబాద్‌లో 1866, మార్చి 17న హైకోర్టు ఏర్పాటు చేశారు.
భారత హైకోర్టుల చట్టం లార్డ్ కానింగ్ వైస్రాయ్‌గా ఉన్న కాలంలో జారీ చేశారు.
కలకత్తా, బొంబాయి, మద్రాస్ హైకోర్టులను 1862లో ఏర్పాటు చేసినప్పుడు వైస్రాయ్ లార్ట్ ఎల్జిన్
హైకోర్టు నిర్మాణం
ప్రకరణ 216 ప్రకారం ప్రతి హైకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తి ఉంటారు.
వీరిని రాష్ట్రపతి నియమిస్తాడు
హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను ఆ రాష్ర్టాల పని పరిమాణాన్ని బట్టి రాష్ట్రపతి నిర్ణయిస్తారు.
న్యాయమూర్తుల నియామకం
హైకోర్టు న్యాయమూర్తులను ప్రకరణ 217 (1) ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు
వీరు 62 సంవత్సరాల వరకు పదవిలో ఉంటారు
తొలగింపు
ప్రకరణ 217 (1)(a) ప్రకారం న్యాయమూర్తుల రాజీనామా పత్రంలో రాష్ట్రపతిని సంబోధిస్తూ తమ పదవికి రాజీనామా చేయవచ్చు.
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
07/04/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment