ప్రపంచంలో మొదటి రాజ్యాంగం బ్రిటన్ రాజ్యాంగం (అలిఖిత రాజ్యాంగం)
– ప్రజల ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా, మొదటి లిఖిత, అతి చిన్న రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం
పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు పాలిటీ (polity)పై పట్టు సాధించాలంటే రాజ్యాంగం, అది ఎలా ఏర్పడింది అనే అంశాలు, చట్టాలు, ప్రతి చట్టంలోని ప్రధాన అంశాలపై అవగాహన ఉండాలి. ముఖ్యంగా గ్రూప్ – II ప్రిపేరయ్యేవారు సిలబస్‌లోని ఐదు అంశాలపై పూర్తి అవగాహన రావాలంటే పరిణామం అనే అంశాన్ని (Topic) అధ్యయనం చేయాలి.
పౌరశాస్త్రం, రాజనీతి శాస్ర్తాలు గ్రీకు తత్వశాస్త్రం నుంచి ఆవిర్భవించాయి. రాజ్యాంగం అనే పదాన్ని గ్రీకు రాజనీతి తత్వవేత్త అయిన ప్లేటో శిష్యుడు అరిస్టాటిల్ తొలిసారిగా ఉపయోగించాడు. రాజనీతి శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్.
రాజ్యాంగ లక్షణాలు
– క్రీ.శ. 1600 నుంచి 1772 వరకు క్రీ.శ. 1600 నుంచి 1772 వరకు
– బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేయడానికి క్రీ.శ. 1600, డిసెంబర్ 31న వ్యాపార పత్రంపై బ్రిటన్ రాణి మొదటి ఎలిజబెత్ సంతకం చేశారు.
– బెంగాల్, బొంబాయి, మద్రాసు భూభాగాలను స్వాధీనం చేసుకొని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన సామ్రాజ్యాన్ని విస్తరించింది. భారత దేశంలో మొదటిసారిగా 1687లో మద్రాస్ రాష్ట్రంలో మున్సిపాలిటీల చట్టం చేశారు.
– సూపర్‌వైజర్ పోస్టుల స్థానంలో కలెక్టర్ వ్యవస్థను 1772, మే 11న బెంగాల్ గవర్నర్ జనరల్ లార్డ్ వారన్ హేస్టింగ్ ఏర్పాటు చేశారు.
– ఈస్ట్ ఇండియా కంపెనీలో జరుగుతున్న అవినీతిని పరిశీలించడానికి 1772లో బ్రిటిష్ ప్రభుత్వం జనరల్ బర్గోయిన్ అధ్యక్షతన ఒక రహస్య సంఘాన్ని భారతదేశానికి పంపింది. ఈ కమిషన్ సిఫారసు మేరకు 1773లో కంపెనీ పాలనను క్రమబద్ధం చేశారు.
– క్రీ.శ. 1773 నుంచి 1857 వరకు 1773 రెగ్యులేటింగ్ చట్టం
– కంపెనీ పాలనను క్రమబద్ధ్దం చేయడానికి 1773, మే 18న లార్డ్ నార్త్ బ్రిటిష్ పార్లమెంటులో చట్టం ప్రవేశపెట్టాడు. దీన్ని రెగ్యులేటింగ్ చట్టం అంటారు. దీనిని భారతదేశంలో మొదటి లిఖిత చట్టంగా పేర్కొంటారు. ఈ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్‌గా మార్చారు. దీంతో వారన్ హేస్టింగ్‌ను బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్‌గా నియమించారు.
రెగ్యులేటింగ్ చట్టం ద్వారా కార్యనిర్వాహక బోర్డును ఏర్పాటు చేశారు. దీంట్లో గవర్నర్ జనరల్‌తో పాటు మరో నలుగురు సభ్యులుగా ఉండేవారు. ఈ చట్టం ఆధారంగా 1774లో కలకత్తాలోని పోర్ట్ విలియం మేయర్ కోర్టుల స్థానంలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. ఈ న్యాయస్థానంలో ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు ఇతర న్యాయమూర్తులను నియమించారు. కలకత్తాలో ఏర్పాటు చేసిన ఈ సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజాయంపి.
1784 పిట్స్ ఇండియా చట్టం
రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సరిదిద్దడానికి ఈ చట్టాన్ని రూపొందించారు. ఆ కాలంలో బ్రిటిష్ ప్రధానిగా ఎడ్మండ్ విలియం పిట్ ఉండటంతో ఈ చట్టానికి పిట్స్ ఇండి యా చట్టం అనే పేరొచ్చింది. ఈ చట్టం ద్వారా కంపెనీ డైరెక్టర్ల అధికారం తగ్గించడానికి బెంగాల్‌లో ద్వంద్వ ప్రభుత్వ విధానం ప్రవేశపెట్టారు.
1. రాజకీయ వ్యవహారాలను చూడటానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఆరుగురు సభ్యులు ఉండేవారు.
1793 చార్టర్ చట్టం
ఈ చట్ట సమయంలో బెంగాల్ గవర్నర్ జనరల్ లార్డ్ కారన్ వాలిస్. ఆయన బెంగాల్, బీహార్‌లో శాశ్వత భూమి శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశ పెట్టాడు. సివిల్ సర్వీసుల పితామహుడు కారన్ వాలిస్.
1813 చార్టర్ చట్టం
ఈ కాలంలో బెంగాల్ గవర్నర్ జనరల్‌గా లార్డ్ మింటో – I ఉన్నారు. ఈ చట్టం ద్వారా భారతదేశంలో ప్రాథమిక విద్య అభివృద్ధికి లక్ష రూపాయలు కేటాయించాలని నిర్ణయించారు. మన దేశంలో క్రైస్తవ మిషనరీలను ఏర్పాటు చేయడానికి అనుమతించారు. విద్య, వైద్యశాలలు ఏర్పాటు చేయడానికి వాటికి అవకాశం కల్పించారు.
1833 చార్టర్ చట్టం
చార్టర్ చట్టాలన్నింటిలో ఇది ప్రధానమైనది. ఈ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని భారతదేశ గవర్నర్ జనరల్‌గా మార్చారు. దీంతో లార్డ్ విలియం బెంటింగ్ భారతదేశ తొలి గవర్నర్ జనరల్‌గా నియమించబడ్డాడు. ఈ చట్టాన్ని అనుసరించి దేశంలో లాకమిషన్ సభ్యున్ని నియమించారు. దీనికి మొదటి సభ్యుడు లార్డ్ మెకాలే.
1853 చార్టర్ చట్టం
ఇది చివరి చార్టర్ చట్టం. ఈ కాలంలో లార్డ్ డల్హౌసీ భారతదేశ గవర్నర్ జనరల్‌గా ఉన్నారు. 1883 చార్టర్ చట్టం ప్రకారం కార్యనిర్వాహక శాఖ నుంచి శాసన మండలిని ఏర్పాటు చేశారు. ఈ చట్టం ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయడానికి మెకాలే చేసిన సూచనల ప్రకారం యోగ్యతా పద్ధతి (Merit system)ని ఏర్పాటు చేశారు.
మాదిరి ప్రశ్నలు
1. పాలిటిక్స్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? (సీ)
2. ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలో అతి చిన్న రాజ్యాంగం? (డీ)
3. రాజ్యం లక్షణాల్లో అతి ప్రధానమైనది ఏది? (సీ)
4. భారతదేశంలో అత్యున్నతమైనదిగా దేనిని భావిస్తారు? ( డీ )
5. భారత రాజ్యాంగ అభివృద్ధి క్రమాన్ని ఆరు దశలుగా ఎవరు పేర్కొన్నారు ? (సీ)
6. దేశంలో మొదటి మున్సిపాలిటీని ఏ నగరంలో ఏర్పాటు చేశారు? (డీ)
7. జిల్లా కలెక్టర్ వ్యవస్థను ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ? (బీ)
8. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను క్రమబద్ధం చేయాలని ఎవరు సిఫారసు చేశారు? (సీ)
9. రెగ్యులేటింగ్ చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు?(సీ)
ఏ) 1757 బీ) 1764 సీ) 1773 డీ) 1772
10.బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్? (డీ)
11. కలకత్తాలో సుప్రీంకోర్టును ఎప్పుడు ఏర్పాటు చేశారు? (బీ)
ఏ) 1773 బీ) 1784 సీ) 1774 డీ) 1793
12. ద్వంద్వ పాలనా విధానాన్ని ప్రవేశపెట్టిన చట్టం? (బీ)
13. సివిల్ సర్వీసుల పితామహుడు? (బీ)
14. భారతదేశంలో ప్రాథమిక విద్యకు లక్ష రూపాయలు కేటాయించిన చట్టం? (బీ)
ఏ) 1793 చార్టర్ చట్టం బీ) 1813 చార్టర్ చట్టం సీ) 1833 చార్టర్ చట్టం డీ) 1853 చార్టర్ చట్టం
No comments:
Post a Comment