రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు శుభవార్త. రైల్వే టూరిజం మానిటర్ పోస్టుల్లో మీ కెరీర్ ను ప్రారంభించేందుకు అవకాశం లభించింది. ఈ పోస్టులను డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా నియమిస్తారు. ఈ పోస్టులు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఖాళీలు ఉన్నాయి. న్యూ ఢిల్లీ, లక్నో, ఛండీగఢ్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు IRCTC యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దాని గురించిన వివరణాత్మక సమాచారాన్ని పొందవచ్చు. ఈ పోస్టులకు ఈరోజు మే 29 నుంచి మే 30 మధ్య వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించబడింది. ఆసక్తిగల అభ్యర్థుల యొక్క విద్యార్హతలు ఈ కింది విధంగా ఉన్నాయి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి టూరిజంలో 3 సంవత్సరాల డిగ్రీని కలిగి ఉండాలి. లేదా ఏదైనా రంగంలో 3 సంవత్సరాల డిగ్రీ మరియు ట్రావెల్ & టూరిజంలో 1 సంవత్సరం డిప్లొమా ఉండాలి. లేదంటే.. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ మరియు 2 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా ట్రావెల్ & టూరిజంలో డిప్లొమా కలిగి ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థుల యొక్క వయస్సు 28 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC / ST / OBC / PWD / Ex-serviceman అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది. ఎంపికైన అభ్యర్థులకు జీతం రూ.30,000 నుండి రూ.35,000 చెల్లిస్తారు. రోజువారీ భత్యం రోజుకు రూ.350 ఉంటుంది. జాతీయ పెన్షన్ అలవెన్స్ (NHA), ఆరోగ్య బీమా - నెలకు 800 రూపాయలు ఉండనుంది. రెసిడెన్షియల్ అలవెన్స్ - రూ.240 ఇస్తారు.

No comments:
Post a Comment