తెలంగాణలో జూన్ 11న జరగనున్న గ్రూప్-1 పరీక్ష నిర్వహణపై తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో గ్రూప్-1 పరిక్ష జరిపి రద్దుచేయడం జరిగింది. రద్దు చేసిన సమయంలోనూ మళ్లీ జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ ను నిర్వహించనున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. పరీక్షకు దాదాపు నెల రోజుల్లోపే సమయం ఉండగా.. పరీక్ష నిర్వహణపై అనేక సందేహాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అసలు పరీక్ష వాయిదా పడుందని కొందరు ప్రచారం చేస్తుండగా.. ఆఫ్ లైన్ కు బదులగా ఈ సారి ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తారన్న ప్రచారం సాగుతోంది. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగా ఆఫ్ లైన్ విధానంలోనే ఈ పరీక్షను నిర్వహించాలని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఓఎంఆర్ పద్ధతిలోనే ఈ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు సాగుతున్నట్లు టీఎస్పీఎస్సీ వర్గాల నుంచి సమాచారం. పలు మీడియా సంస్థలు సైతం ఈ మేరకు వార్తలు వెల్లడించాయి. దీంతో అభ్యర్థులు ఎలాంటి టెన్షన్ పడుకుండా ప్రిపరేషన్ సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్ష షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని టీఎస్పీఎస్సీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గతేడాది ఏప్రిల్ 26న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ మళ్లీ ఎగ్జామ్ రాసే అవకాశాన్ని కల్పించింది. గతంలో జరిగిన పొరపాట్లను దృష్టిలో ఉంచుకుని.. ఈ సారి అలా జరగకుండా అత్యంత పకడ్భందీగా పరీక్షను నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

No comments:
Post a Comment