Mother Tongue

Read it Mother Tongue

Sunday, 14 May 2023

AP | TS Postal GDS Results 2023: గుడ్ న్యూస్.. 40వేలకు పైగా ఉద్యోగాలకు ఫలితాలు విడుదల..

పోస్టల్ డిపార్ట్ మెంట్ లో మొత్తం 40 వేలకు పైగా ఖాళీలకు ఇటీవల దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. వీటికి సంబంధించి తాజాగా ఫలితాలను విడుదల చేశారు. వాటిని ఇక్కడ చెక్ చేయండి. ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ 40,889 జీడీఎస్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం దేశ వ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం 23 పోస్టల్ సర్కిళ్లల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి పదో తరగతి పాస్ అయితే సరిపోతుంది. 10వ తరగతిలో గణితం, ఆంగ్లం తప్పనిసరి సబ్జెక్టులుగా ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థి సెకండరీ తరగతి వరకు స్థానిక భాషను అభ్యసించి ఉండటం కూడా అవసరం. తాజాగా ఈ పోస్టులకు సంబధించి ఫలితాలను పోస్టల్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది. తెలంగాణలో సర్కిల్ లో 1261, ఏపీ సర్కిల్ లో 2477 పోస్టులు ఖాళీగా ఉండగా.. వీటికి సెలెక్ట్ అయిన అభ్యర్థుల జాబితాను వెబ్ సైట్లో పొందుపరిచారు. ఇప్పటికే రెండు లిస్ట్ లను విడుదల చేసిన .. పోస్టల్ డిపార్ట్ మెంట్ తాజాగా మూడో జాబితాను వెల్లడించింది. ఈ జాబితాలో పేరు ఉన్న అభ్యర్థులు మే 20, 2023 తేదీన జరిగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కావాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ కు హాజరయ్యే అభ్యర్థుల వెంట ఓరిజినల్ సర్టిఫికేట్లతో పాటు.. రెండు జతల విద్యార్హత సర్టిఫికేట్లను జిరాక్స్ తీసుకురావాలని వెబ్ నోట్లో పేర్కొన్నారు. అయితే పదిలో వచ్చిన మెరిట్ స్కోర్ అధారంగా ఈ ఎంపిక ప్రక్రియ జరిగింది. చాలా మందికి పది లో 100 మార్కులు, 95 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు ఎంపికయ్యారు. ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు. వీరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత తర్వాత జాయినింగ్ లెటర్ ను ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ మూడో జాబితాలో ఏపీ నుంచి 570 మందిని ఎంపిక చేశారు. తెలంగాణ నుంచి 548 మందిని ఎంపిక చేశారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో మే 22వ తేదీ లోపు తమ పోస్టల్ డిజిజినల్ హెడ్ ఆఫీస్ లో సంప్రదించాల్సి ఉంటుంది. ఫలితాల కొరకు https://indiapostgdsonline.cept.gov.in/ ఈ లింక్ ను ఉపయోగించండి.

ముఖ్యమైన లింక్స్

  1. ఫలితాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

No comments:

Post a Comment

Job Alerts and Study Materials