దీనిలో మీ టీఎస్పీఎస్సీ ఐడీతో పాటు.. పుట్టిన తేదీని ఎంటర్ చేయాలి. తర్వాత మీ మొబైల్ కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేస్తే.. మీ అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. దానిలో మీ వివరాలను సరి చేసుకోవచ్చు. తెలంగాణలో 8039 గ్రూప్-4 ఖాళీల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం ముగియగా.. మొత్తం 9లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 30 తో ముగియగా.. మరో నాలుగు రోజులు పొడిగించిన విషయం విధితమే. అయితే చాలామంది అభ్యర్థులు గ్రూప్ 4 దరఖాస్తుల ప్రక్రియలో తప్పులు దొర్లినట్లు టీఎస్పీఎస్సీకి వినతులు సమర్పించారు. అయితే.. వీటిపై స్పందిస్తూ టీఎస్పీఎస్సీ దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ కు అవకాశం కల్పించింది. దీనిని మే 09 నుంచి మే 15 వరకు చేసుకోవచ్చని తెలిపింది. అంటే దరఖాస్తుల ఎడిట్ కు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇంకా ఎవరైన తమ దరఖాస్తుల్లో తప్పులను సరిచేసుకోకుంటే.. ఈ లింక్ https://www.tspsc.gov.in/ ద్వారా చేసుకోవచ్చు. దీనిలో మీ టీఎస్పీఎస్సీ ఐడీతో పాటు.. పుట్టిన తేదీని ఎంటర్ చేయాలి. తర్వాత మీ మొబైల్ కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేస్తే.. మీ అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. దానిలో మీ వివరాలను సరి చేసుకోవచ్చు. ఎడిట్ కు ఒక్కసారి మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ వెబ్ నోట్ లో పేర్కొంది. మరో సారి ఎడిట్ చేసుకునేందుకు అవకాశం ఉండదని.. అభ్యర్థులు ఈ రెండు రోజుల్లోనే ఆ ప్రక్రియను ముగించాలని అభ్యర్థులకు సూచించింది. ఇక గ్రూప్ 4 పరీక్ష తేదీని మూడు నెలల క్రితమే ప్రకటించింది.
జూలై 01న ఈ పరీక్ష నిర్వహించనుండగా.. దీనిని వాయిదా వేయాలని.. టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల వ్యవహారంతో.. తామంతా ఆందోళన చెందామని.. ప్రిపరేషన్ కు కాస్త సమయం ఎక్కువ ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. గ్రూప్ 4 కు గ్రూప్ 2 మధ్య కనీసం మూడు నెలల సమయం ఇవ్వాలని.. గ్రూప్ 1 కు.. గ్రూప్ 4 మధ్య కూడా రెండు నెలల సమయం ఇవ్వాలని కోరుతున్నారు.
ముఖ్యమైన లింక్స్
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment