మొహంజోదారో నిర్మాణము
మొహంజోదారో ఒక చక్కటి ప్రణాళిక ప్రకారము నిర్మించబడిన నగరము. ఇక్కడ ఒక అంతస్తు కన్నా ఎక్కువ గల భవనములు ఉండేవి. హరప్పా నగరంలోని కుడ్యముల లాలా మొహంజోదారోలో నిర్మించిన గోడలు లేవు. మంచినీటి కోసం ఉపయోగించే బావులు కూడా బయల్పడినవి. మొహంజోదారోలో స్నాన వాటికలు అత్యంత విశాలంగా ఉండేవి. మురుగు నీటి పారుదల వ్యవస్థ కూడా ఉండేవి. అన్ని ఇళ్ళ నుండి వచ్చే మురుగు నీటి కాలువలు వీధి చివరలందు నిర్మించిన పెద్దవైన రాతితో కట్టబడిన మురుగు నిలవలలో చప్, సింధసప్ NA సగరములలో వందల సం. లో మంచి నీటి బావులున్నట్లు కనుగొనబడినది. దీని వలన కాలంలో మంచినీటి ఎద్దటి లేనట్లుగా తెలుస్తున్నది.
ముద్రికలు
సింధు ప్రజలు స్టియెడైడ్ ముద్రలను వాడుకలోకి తెచ్చారు. మొహంజోదారోలో 2000 ముద్రలు, లోథాల్ లో 210 ముద్రలు లభించాయి. మట్టి ముద్దలపై ఈ విధమైన ముద్రలు కలవు. ఈ ముద్రలు చతురస్రంగా, గుండ్రంగా, స్తంభాకారాల్లో ఉన్నవి. ఈ ముద్రికలలో ఒక ముద్రికపై యోగి సింహాసనాసీనుడై ఉన్నాడు. అతని తలపై ఎద్దు కొమ్ముల కిరీటం కలదు. ఏనుగులు, పెద్ద పులులు, రక రకాలైన జంతువులు అతని చుట్టు ఉన్నవి. ఇతనిని పశుపతి (శివుడు) గా భావించడం జరిగింది. సరుకులను ఒక దేశం నుండి మరో దేశానికి చేర్చడానికి, వర్తక వ్యాపారానికి ఈ ముద్రలు ఉపయోగపడేవి. దేశ విదేశీ వ్యాపారాల కొరకు ఉపయోగించబడిన ఈ ముద్రికా చిహ్నాలు ఆ నాటి ప్రజల పరిజ్ఞాన సంపదకు తార్కాణాలుగా భావించవచ్చు. ఈ ముద్రికలపై ఏనుగులు, జంతువులు, పశుపతి మొదలైన చిత్రాలు ముద్రింపబడి ఉండడం వలన అవి ఆనాటి మత చిహ్నాలుగా భావించడం జరిగింది. ఈ ప్రాంతాలలో వృషభ చిహాలున్న ముద్రికలు ఎక్కువగా లభించినవి. దీనిని బట్టి ఆ నాటి ప్రజలు వృషభారాధకులని తెలుస్తున్నది. పశుపతి శివునిగా, నంది అనగా వృషభము అతని వాహనంగా గుర్తింబడి అది వ్యవసాయ వృత్తి అవలంబించిన వారికి ఉపయోగ పడే జంతువు కాబట్టి వృషభమునకు దానికి అధిపతి యైన పశుపతికి ఆ నాటి ప్రజలు ఎక్కువగా ప్రాధాన్యత నిచ్చే వారు.
దేవతారాధన
సింధూ ప్రజల కాలంలో మాతృదేవత ఆరాధన జరిగేది. అదే విధంగా నరబలి, పశుబలి ఆచారాలు కూడా వాడుకలో ఉండేవి. మొహంజోదారో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయము. గోధుమ పంట పండించి, ఆహరముగా ఉపయోగించేవారు. వీరు రాగి గొడ్డళ్ళను, కత్తులను, పదునైన లోహపు రేకులను ఉపయోగిం చేవారు.
ఆభరణాలు
కార్నేలియస్ రాతితో తయారు చేయబడిన రాళ్ళ పూసల ఆభరణములను ఆనాటి ప్రజలు ధరించేవారు. ప్రియొడైడ్ పూసలు, బంగరు గొలుసులు, వివిధములైన ఆభరణములను మొహంజోదారో ప్రజలు ధరించుచుండిరి. కాటుక, బొట్టు, వస్త్రముల ఉపయోగం కూడా సింధూ ప్రజలకు తెలుసు. మాంసాహారులు చేపలను పట్టి ఆహారంగా భుజించేవారు. సింధూ కాలపు తవ్వకాలలో గృహోపకరణముల పైన రకరకాల చిత్రాలు, జంతువుల బొమ్మలు, నల్ల రంగు సిరాతో వేసిన రక రకాల చిత్రాలు లభించినవి.
తవ్వకాల్లో వెలువడిన ప్రదేశాలు
సింధు రాష్ట్రములోని అర్కానా జిల్లాలోని మొహంజోదారో ప్రాచీన నాగరికతకు ఆలవాలమైన ప్రదేశము. కరాచీ పట్టణమునకు 480 కి.మీ. దూరంలో గల అత్యంత మనోహరమైన ఈ ప్రదేశము 'నక్షిస్థాన్' (సింధు దేశపు ఉద్యానవనము)అని ప్రసిద్ధిగాంచింది. సప్తసింధు లోయలో ఉన్న నగరములు అనేక సార్లు నశించి, తిరిగి పునరుద్దరించబడినవి. ఈ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో ఏడు పట్టణముల పునాదుల పొరలు కనిపించినవి. ఎం.ఎస్.వాట్స్ క్రీ.శ. 1921 నుండి 1934 వరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజీ సర్ మార్టిమర్ వీలర్ పర్యవేక్షణలో ఈ ప్రాంతంలో పరిశోధనలు నిర్వహించాడు. క్రీ.శ. 1931లో హరప్పా నాగరికతను పోలి ఉన్న చనుదారో పరిశోధనా పరిధిలోకి వచ్చింది. క్రీ.శ. 1935-36వ సంవత్సరము నాటి త్రవ్వకములందు ఈ ప్రదేశంలో మూడు భవనముల అడుగులు కనిపించినవి. అదే విధంగా ఝకార్, జాగల్ ప్రాంతల్లో కూడా ఇదే విధమైన నాగరికతా చిహ్నాలు గల ప్రదేశాలు వెలుగులోకి వచ్చినవి. హరప్పా సంస్కృతికి చెందిన వస్తువులను పోలిన పరికరములు అంబాలా జిల్లాలోని రూపాల్లో జరిపిన తవ్వకాలలో
బయల్పడినవి. సౌరాష్ట్రలోని లోథాల్, రంగాపూర్లో జరిపిన తవ్వకాలలో రాగి గొడ్డలి, పూసలు, మోలీలు, మురుగునీటి పారుదలకు అనువైన కట్టడాలు గుర్తించబడినవి. తెలంగాణ రాష్ట్రంలోనొ నల్లగొండ జిల్లాలో రాయగిరి స్టేషన్ పరిధిలో ప్రాచీన కాలపు స్మశాన వాటిక ఒకటి కనుగొన బడింది.
లోథాల్ లో సింధు లిపికి సంబంధించిన 210 సీళ్ళు కనుగొనబడినవి. బంగారు పూసలు, పాత్రలు, రాగితో చేసిన బాణములు, టెర్రకోట జంతువుల ప్రతిమలు, బొమ్మలు, రొమ్మురేకు వంటి సింధు నాగరికత చిహ్నాలు కూడా లభించినవి. రాజన్లలోని కాలిబంగన్ (నల్లగాజులు) తవ్వకములు క్రీ. శ. 1961 నుండి 1969 వరకు నిర్వహించబడినవి. ఈ ప్రాంతంలో పరిశోధనలు నిర్వహించిన వారిలో బి. బి. లాల్, బి.కె. థాపి ముఖ్యులు.
వ్యాపారం
మొహంజోదారో నగర వర్తకులు, వర్తక వ్యాపారాలు చేసేవారు. వారు ఈజిప్టు, మెసపటేమియా, బాబిలోనియా వంటి పశ్చిమ దేశాలతో కూడా వ్యాపారాలు చేస్తూ ఉండేవారు. తమ ప్రాంతంలో లభించే వస్తువులను, పనిముట్లను, ఆహార ధాన్యాలను విదేశాలకు సరఫరా చేసి అధిక మొత్తంలో లాభాలు గడించేవారు. అదే విధంగా విదేశాల నుండి వస్తువులను తెచ్చి తమ ప్రాంత ప్రజలకు విక్రయించేవారు. దీని వలన సింధు నాగరికత కాలంలో విదేశీ వ్యాపారం ఉచ్ఛ స్థితిలో ఉన్నట్లు తెలుస్తున్నది.
సింధు ప్రజలు ఉన్నిబట్టలు, నూలు బట్టలు ధరించేవారు. ఆ కాలంలో ప్రత్తి పంట ఎక్కువగా పండేది. సింధు ప్రాంతము నుండి ఈజిప్టు, మెసపుటేమియా, బాబిలోనియాలకు నూలు బట్టలను ఎగుమతి చేసేవారు. పంజాబ్ లోని రావి నదీతీరమున విలసిల్లిన హరప్పా నాగరికతా కాలం నాటి ప్రజలు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. గొట్టెల పెంపకంను అభివృద్ధి పరిచి ఉన్ని దుస్తులకు గొట్టెలను వాడేవారు.
వృత్తి
సింధు లోయలో విలసిల్లిన నాగరికత కాలం నాటి నగర జీవనము పల్లెలపై ఆధారపడినది. ప్రజల్లో ఎక్కువ శాతం మంది వ్యవసాయం ముఖ్యవృత్తిగా స్వీకరించడం దీనికి ప్రధాన కారణం. వ్యవసాయదారులు గోధుమ, బార్లీ, ఉలవలు, పెసలు వంటి పంటలను పండించి నగరాలకు సరఫరా చేసి తగిన లబ్ధి పొందేవారు. సింధూ ప్రజలు గోధుమను ముఖ్యమైన ఆహారంగా స్వీకరించేవారు. పశువుల పాల నుండి పెరుగు, జున్ను, వెన, నెయ్యి మొదలైన పదార్థాలను తయారు చేయడం వారికి తెలుసు. సింధూ కాలం నాటి ప్రజలకు రుచికరమైన భోజన పదార్థాలను తయారు చేయడం తెలుసు. మేకలు, గొట్టెల వంటి జంతువులను పెంచుతూ వాటి సంతతిని అభివృద్ధి చేసి అధిక లాభాలు గడించేవారు.
ఈ కాలం నాటి ప్రజలకు తెలసిన జంతువులు - ఏనుగులు, ఒంటెలు, మహిషములు(దున్నలు), ఎద్దులు, గుఱ్ఱములు, శునకములు, గొట్టెలు, నల్ల ఎలుకలు, జింకలు, ముంగీసలు, కారెనుము(బైసన్) కుందేలు, కోతులు, పులులు. ఈ జంతువులకు సంబంధించిన ముద్రికలు సింధూ నది లోయల్లో లభించినవి. ఏనుగులు, ఒంటెలను వస్తువులను ఒకచోటి నుండి మరొక చోటికి తరలించుటలో ఉపయోగించేవారు. అదే విధంగా ఎద్దులు, దున్నలు, గుఱ్ఱములు వ్యవసాయ పనులలో ఉపయోగించేవారు. గొట్టె, మేక తదితర జంతువుల ఎరువులు పంటపొల్లాల్లో వాడేవారు. కుక్కలను ఇండ్లలో పెంచుకొనే అలవాటు ఆనాటి ప్రజలకు కలదు. లోహ పరిజ్ఞానం - ఆభరణాలు
మొహంజోదారో ప్రజలకు రాగి, వెండి, సీసము, బంగారము, రేకు వంటి లోహముల పరిజ్ఞానం కలదు. వీరికి ఇనుము వాడకం తెలియదు. రాగి పనిముట్లను ఎక్కువగా వాడేవరు. వీరికి రాగి పుష్కలముగా లభించడం వలన ఇనుమును ఉపయోగించే అవసరం రాలేదు. వేటకు సంబంధించిన ఆయుధములు, ఇళ్ళలో రోజువారీ వాడే వస్తువులు, వంట పాత్రలన్నీ రాగితోనే తయారు చేసుకొనేవారు. బంగారం, వెండి ఆభరణాలకు ఎక్కువగా ఉపయోగించే వారు. బంగారం, వెండి అంటే వారికి అమితమైన ప్రీతి. ఎముకలు, నత్తగువ్వలతో అనేక వస్తువులను తయారు చేసుకొనేవారు. స్త్రీలు అలంకారం కొరకు బంగారు, రాగి, వెండి ఆభరణాలు ధరించేవారు. పురుషులు దండ కడియాలు, కాలి కడియాలు, మొలత్రాళ్ళు ధరించేవారు. గృహోపకరణాలను, మృణ్మయ పాత్రలే కాకుండా రాగితో తయారు చేయబడిన వస్తువులు కూడా ఆనాడు వాడుకలో కలవు. ప్రజలు నత్తగుల్లలు దండలుగా చేసుకొని మెడలో ధరించేవారు.
జీవన విధానం
మొహంజోదారో ప్రజలు విలాసవంతమైన భవనాల్లో నివసించేవారు. వీరికి వేటయందు ఆసక్తి తక్కువగా ఉండేది. నృత్యగానాదుల వంటి లలిత కళలలో వీరికి ప్రవేశం కలదు. మొహంజోదారోలో బొమ్మలు, చిత్రములు ఎక్కువ సంఖ్యలో కనుగొనబడినవి. వీటి ద్వారా ఆ నాటి బాల బాలికలు ఆట పాటలందు ఎక్కువ ఆసక్తి కలిగి ఉండేవారని తెలుస్తున్నది. మొహంజోదారో, హరప్పా ప్రాంతపు తవ్వకాలలో లభించిన మృణ్యయ పాత్రలు పై భాగంలో నలుపు, ఎరుపు రంగులలో చిత్రములతో తయారు చేయబడినవి. మృణ్మయ పాత్రల లోపలి భాగములో నీలి ఆకుపచ్చని ద్రవపదరామును పూసి ఆరబెట్టడం వలన నునుపుగా, ఈ కాలంలోని జాడీల వలె ఉండేవి. సింధు లోయలో జరిగిన త్రవ్వకాలలో క్రొత్త రాతియుగ కాలం నాటి శిలా పరికరములు లభించినవి. మొహంజోదారలో తవ్వకాలలో రాగి, కంచు, రాతి ఆయుధాలు
కనుగొనబడినవి. వాటిలో కత్తులు, ధనుస్సులు, బాణములు, బరిసెలు మొదలైనవి కలవు. ఆ కాలంలో కాలక్రమాన ఆయుధముల తయారీ ఒక పరిశ్రమా మారింది.
దైవారాధన
సింధు లోయలో లభించిన ముద్రికలు మొహంజోదారో, హరప్పా నాగరికతను తెలిసికొనుటలో ప్రధాన పాత్ర వహిస్తున్నవి. ఈ ముద్రికల పై జంతువుల ప్రతిమలు కలవు. రాతిపైన, స్తంభముల పైనను గల ప్రతిమలు గ్రీకు నాగరికతా చిహ్నముల కతి సన్నిహితముగ నున్నట్లు భావింపబడినది. రావి నదీ పరివాహక ప్రాంతంలో లభించిన దిగంబర దేవత మూడు ముఖాలు, కొమ్ములు కలిగి, పీఠముపై కూర్చన్నది. ఈ దేవతా ప్రతిమ
చుట్టూ అనేక జంతువులు చిత్రింపబడినవి. గాజులు తొడుగబడిన చేతులతో గల ఈ దేవత వెంట్రుకలు నిడుపుగా నుండి చక్కగా దువ్వబడి ఉన్నది. ఇది పరమ శివుని సూచించు ప్రతిమ గల ముద్రిక. శివుడినే పశుపతిగా కొలిచేవారు. ఒక దున్నపోతును మానవ సమూహము ఎదుర్కొంటున్నట్లు గల ముద్రిక మొహంజోదారోలో లభించినది. సింధు నాగరికతా కాలంనాటి ప్రజలు శివపూజా ధురంధరులని హరప్పా, మొహంజోదారో ప్రాంత తవ్వకాలలో లభించిన ముద్రికల వలన తెలుస్తున్నది. శివపూజ, శక్తి ఆరాధన ఆ రోజుల్లో వ్యాప్తిలో ఉంది. సింధూ ప్రాంతములలో లభించిన స్త్రీ దేవతా మూర్తులలో మాతృదేవత విశిష్టమైనది. ఇటువంటి మాతృదేవతా ప్రతిమలు బెలూచిస్థాన్ దక్షిణ భాగాలలో అసంఖ్యాకంగా దొరికనవి. జోబ్ లోయలో కాళీమాతకు సంబంధించిన ప్రతిమలు, చిత్రములు లభించినవి. శక్తి యొక్క ఆరాధన విధానము సింధునదీ పరీవాహక ప్రాంతము నుండి యూప్రటీస్, టైగ్రీస్, నైలు, డాన్యూబ్ నదుల పరీవాహక ప్రాంతాల వరకు విస్తరించింది. సింధూ లోయలో నివసించిన ప్రజలు స్త్రీ, పురుష, ప్రకృతి ఆరాధకులని అక్కడ లభించిన ముద్రికల వలన తెలుస్తున్నది. వీరు ప్రకృతిలోని వృక్షములను, కూరమృగాలను, సరీసృపాలను కూడా పూజంచారు. రావిచెట్టు తదితర వృక్షములను శక్తివంతమైన వృక్షములుగా భావించి పూజించేవారు. వనదేవతకు రూపము కల్పించి పూజంచారు. రావి, కసివింద వంటి వృక్షాలు ఆనాటి ప్రజలచే పూజలందుకొని పవిత్రమైనవిగా భావింపబడినవి. ఆ కాలంలోనే వృక్షారాధన జాతీయరాధనగా భావించబడినది.
మూడు ముఖాలు గల పురుషాకృతి సింధు నాగరికత విలసిల్లిన కాలమున ప్రకటింపబడిన ముద్రికలలో కనిపిస్తుంది. దానికి ఇరువైపులా జంతువులు చిత్రించడం జరిగింది. ఈ పురుషాకృతి శివునిది. ఇది అత్యంత ప్రాచీనమైన శివ ప్రతిమగా భావించబడినది.
మొహంజోదారో, హరప్పా పట్టణ ప్రజలు శివలింగమును, యోనిని పూజంచేవారు. శివుని వాహనమైన నంది వంటి మృగముగా సింధు లోయలో లభించిన ముద్రికల పై కనిపిస్తుంది. వీరికి యోగవిద్య కూడా తెలుసని తవ్వకాలలో లభించిన యోగ ప్రతిమలు, ముద్రికల ద్వారా తెలుస్తున్నది. మరణించిన వారి శవములను పూడ్చి పెట్టే ఆచారం ఆనాడు అమలులో ఉండెను. కొన్ని ప్రాంతాల్లో దహనం, పూడ్చి పెట్టడం రెండు ఆచారాలుండేవి. దీనిని బట్టి నాగరికత గల ప్రజలు ఆచరించే అని సంస్కార క్రియలన్నీ మొహంజోదారో, హరప్పా నగరముల ప్రజలు ఆచరించినట్లు తెలుస్తున్నది. క్రొత్త రాతియుగం నాటి సిన్, డాల్మెన్ సమాధులు భారతదేశంలో లభిం చినవి.
అనే
రావి నదీ పరివాహక ప్రాంతంలో చిన్న ముద్రికలు లభించినవి. ఈ ముద్రికలపై వ్రాతలు కూడా కలవు. ఆనాటి ప్రజలు వాడిని లిపి ఈ ముద్రికలపై కనిపిస్తుంది. దీనిని బట్టి వారు లిపి, భాషా జ్ఞాన సంపన్నులని తెలుస్తున్నది. మొహంజోదారో, హరప్పా నాగరికతా కాలం నాటి లిపిని గురించి పరిశోధకులు భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చారు. హీరోస్ అనే పండితుడు సింధూలోయలో లభించిన ముద్రికల పై గల లిపిని కుడి నుండి ఎడమవైపునకు చదవ గలిగాడు. తాను చదివిన లిపిని అతడు తమిళ భాషలోనికి అనువదించాడు. కానీ ఇతని అభిప్రాయంతో శాస్త్రజ్ఞులు ఏకీభవించలేదు. "ది ఇండో సుమేరియన్ సీల్స్ డెసిఫర్డ్ గ్రంథంలో సర్ జాన్ మార్షల్ సింధులోయలో కనుగొనబడిన ముద్రికల పై ఉన్న భాష సుమేరియన్ల భాషలాగా ఉన్నదని భాష, లిపి వివరాలు తెలిపినాడు. డా॥ ప్రాణ్ నాథ్ సుమేరియన్ లిపి సింధు లోయలో విలసిల్లిన లిపికి భిన్నముగా ఉన్నదని భావించాడు. హరప్పాలో మూడు సార్లు పునర్నిర్మించబడిన నగరములు గలవు. హరప్పా, మొహంజోదాలో త్రవ్వకాలలో 2000 ముద్రలు లభించాయి. వీటిపై ఒక పక్క జంతువుల బొమ్మలు, చిత్ర లిపులున్నవి. రెండవ పక్క గుబ్బలున్నవి. ఈ ముద్రికలలో కొన్నిటి పై లిపులు కూడా ఉనన్నవి. స్వస్తిక్ చిహ్నము, రేఖాగణితము గుర్తులు, మృగముల బొమ్మలు, ఎత్తైన మూపురము గల దున్నపోతులు, నేలపై నడిచే గంగడోలు ఎడ్లు, ఏకశృంగ వృషభములు, ఏనుగులు, కారెనుములు, వివిధ జాతి మృగములు మనిషి పులితో పోరాడుతున్న దృశ్యములు ముద్రికలపై కనిపించుచున్నవి. ఇక్కడ లభించిన ముద్రికలపై 396 అక్షరాలున్నవి. ఇటువంటి అక్షరాలు గల ముద్రికలే మెసపుటేమియాలో కూడా లభించాయి. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ జిల్లాలోని సరగ్వాలా గ్రామంలో శిథిలావశేషాలు కనుగొనబడినవి. అవి లోథాల్ అనే ప్రాచీన నగరం యొక్క అవశేషాలుగా గుర్తించబడినవి. ఇక్కడ జరిగిన తవ్వకాలలో 210 ముద్రికలు దొరికనవి. ఇవి సుద్ద రాతి ముద్రలు. వీటి పై చిత్రింపబడిన లిపి మొహంజోదారో, హరప్పాలలో లభించిన ముద్రలిపిని పోలి ఉన్నది. లోథాల్ ప్రాచీన రేవు పట్టణము దేశ విదేశ వ్యాపారముకు అనువైన నగరముగా ఉండేది. మొహంజోదారో మొదట చిత్రలిపిగా ఉండేది. ఏదైనా ఒక వస్తువును తెలియజేయడానికి ఆ వస్తువు పేరులోని తొలి అక్షరమును సూచించే చిత్రాన్ని ముద్రికపై చిత్రించేవారు.
బ్రాహ్మీలిపి భారత లిపి, ఖరోష్టి లిపి సెమ్ జాతిలోని అరటున్ తెగవారు వాడిన లిపి. బ్రాహ్మీ లిపి సంపర్కము వలన ఖరోష్టి లిపి సంస్కృత ప్రాకృతాల భాషలను అక్షర రూపంలో రూపొందించుటలో తోడ్పడింది. క్రీ.పూ. ఆరవ శతాబ్ది నుండి భారతదేశంలో శాసనములు వేయింప బడుచూ వచ్చినవి. బ్రాహ్మీ లిపిలో కనిపించు తొలి శాసనములు ఆర్యావర్త మందును, దక్షిణాపథ, దక్షిణ భారతములందు ఉన్నవి. బ్రాహ్మీ లిపి పూర్వరూపము మొహంజోదారో, హరప్పా, లోథాల్ లందు లభించిన ముద్రల లిపిలో కనిపిస్తుంది. క్రమ పరిణామంలో ఈ లిపి బ్రాహ్మీ లిపిగాను, బ్రాహ్మీ లిపి నుండి మిగిలిన భారత లిపులు ఏర్పడినవి. హిబ్రూ, బైబిల్ భాషకు సంబంధించిన భాష, సింధూ లోయలోని ప్రజలు మాట్లాడిన భాష, హిబ్రూ భాష ఒక్కటే అని 'మోరిస్ జెప్పి వాన్' అనే అమెరికా పురాతత్వ శాస్త్రవేత్త అభిప్రాయపడినాడు. సింధు నాగరికత లిపి, భాష ప్రాచీన సంస్కృత భాషకు, లిపికి సంబంధించినదని సుధాంశు రాయ్ తెలిపినాడు. సింధు నాగరికత భాష, లిపి, వేదకాలమునాటి లిపికి, నాగరికతకు అతి దగ్గరగా ఉన్నదని ఎం. వి. ఎస్. కృష్ణారావు తెలిపాడు. డా|| ఫతే సింగ్ డైరెక్టర్ రాజస్థాన్ ఓరియంటల్ రిసర్చ్ ఇన్స్టిట్యూట్, జోధ్ పూర్) సింధులోయలోని లిపి, భాష సంస్కృతం అని తెలిపాడు. స్కాండినేవియాలో గల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ స్టడీస్ అనే సంస్థలోని ఫిన్నిష్ మేధావులు సింధు నాగరికతను పూర్వార్య లేదా ద్రావిడ నాగరికత అని వెల్లడించారు.
No comments:
Post a Comment