మౌర్య చంద్రగుప్తుడు
మౌర్య వంశ స్థాపకుడు అయిన చంద్రగుప్తుని జీవితం భారతదేశ చరిత్రను అత్యంత ప్రకాశవంతంగా మార్చింది. విశాఖ దత్తుడి రచన ముద్రారాక్షసం అనే నాటకంలో చంద్రగుప్తుడు హీనకులానికి చెందిన వాడని ఉన్నది. చంద్రగుప్తుని కుమారుడు బిందుసారుడు క్షత్రియునిగా సింహాసనం అధిష్టించినట్లు దివ్యావదాన గ్రంథంలో తెలుపబడింది. పాటలీ పుత్ర నగరానికి పూర్వం పుష్పపురము, కుసుమాపురం అని పేర్లుండేవి. చంద్రగుప్త మౌర్యుడు పాటలీపుత్రంలో జన్మించాడు. చాణక్యుడు చంద్రగుప్తుని తన ఆశయ సిద్ధికోసం తన వెంట తక్షశిలకు తీసుకొని వెళ్ళి అక్కడే సర్వ శాస్త్ర ప్రావీణ్యునిగా తీర్చి దిద్దినాడు.
చాణక్యుడు తన సైన్యంలో చేర్చుకోదగిన జాతుల గురించి అర్థశాస్త్రంలో వివరించాడు.
1) దొంగలు, దోపిడీ దారులు, బందిపోట్లు, 2) కిరాతుల వంటి బ్లేచ్ఛులు, 3) చోరగణాలు, 4) ఆటవికులు, 5) శరొపజీవులు మొదలైన వారిని సైన్యంలో చేర్చుకొని శిక్షణ ఇప్పించి యుద్ధ ప్రవీణులను చేశాడు.
మగధ, గ్రీకు రాజుల యుద్ధంలో ఓటమి చవిచూసిన సెల్యూకస్, చంద్రగుప్తునితో సంధి చేసుకొన్నాడు. అందులో భాగంగా పలు ప్రాంతాలు మగధ స్వాధీనం చేయడమే కాకుండా తన కూతురును చంద్రగుప్తునికిచ్చి వివాహం జరిపాడు. సెల్యూకస్ చంద్రగుప్తునితో ఏర్పరచుకొన్న స్నేహ సంబంధముల వలన మగధ రాజ్యంలో తన రాయబారిగా మెగస్తనీసును నియమించాడు. జైన సాహిత్యం ప్రకారం చంద్రగుప్తుడు తన అవసాన దశలో ఐహిక విషయములకు దూరమై, భద్రబాహు అనే జైనాచార్యుని నాయకత్వమున మైసూరు రాష్ట్రమందలి
శ్రావణ బెళగొళ ప్రాంతమునకు వలస పోయినట్లు తెలుస్తున్నది. చంద్రగుప్తుడు, భద్రబాహువు జైనమత దీక్ష వహించి, సిద్ధులై జీవితాంతం జైనమత సిద్ధాంతములను అమలు పరుస్తూ ఉండే వారని చంద్రగుప్తుడు నివసించిన కొండ చంద్రగిరి గాను, అతడు నిర్మించిన దేవాలయము చంద్రగుప్త బస్తీ (జైన బసది) గాను నేటికి ప్రచారంలో ఉన్నవి. చంద్రగుప్తుడు పాటలీపుత్ర నగరమును రాజధానిగా మహా వైభవంతో మగధను పాలించాడు. అశోకుడు వేయించిన శాసనములు చంద్రగుప్తుని కళింగ విజయమును మాత్రమే పేర్కొంటున్నవి. చంద్రగుప్తుని పుత్రుడు బిందుసారుడు తండ్రి వలె గొప్ప విజేత కాకపోయినప్పటికీ తండ్రి సంపాదించిన రాజ్యమును కాపాడుకొన్నాడు. సౌరాష్ట్రము మౌర్య సామ్రాజ్యంలో అంతర్భాగమని మొదటి రుద్ర దాముని శాసనము సూచించుచున్నది. ఇక్కడ చంద్రగుప్తుని ప్రతినిధిగా పుష్యగుప్తుడును వైశ్యుడుండెను. అశోకుని కాలంలో ఈ ప్రాంతమును యవనుడైన తుషాస్ప పాలించుచుండెను. విశాల సామ్రాజ్యమును రాష్ట్రములుగ విభజించి ఆయా రాష్ట్రములకు రాజప్రతినిధులను నియమించెను. పరిపాలనా విధానమున ఇది వికేంద్రీకరణ పద్ధతిగా పరిగణింపబడినది. అసలైన ప్రజాస్వామ్య పునాదులపై ఆనాటి రాజ్య వ్యవస్థ ఆధారపడి ఉండెను. ఒక్క మగధ రాజ్యంలోని పటిష్టమైన పరిపాలనా వ్యవస్థ ఆ కాలంలో కనిపిస్తుంది. మెగస్తనీసు రచించిన ఇండికా గ్రంధంలో భారతదేశ భౌగోళిక స్థితి, ఉత్పత్తులు, సాంఘిక, రాజకీయ, మత పరిస్థితులు, నిష్పాక్షికముగ సవివరముగ రచించబడినవి. ఈ గ్రంథమున చంద్రగుప్తుని పరిపాలనా విధానము సూచించబడినది.
సండ్రకొట్టాస్ (చంద్ర గుప్తుడు) కుమారుడు, మగధ వారసుడు అయిన అల్లిబ్రో చేడెన్ (బిందుసారుడు) తండ్రి తరువాత సింహాసనం అధిష్టించాడు. బిందుసారుడిని అథెనాయిస్ అనే గ్రీకు రచయిత అమిత్రో బేట్స్ అని పేర్కొన్నాడు. అనగా అమిత్రఘాత (శత్రు సంహారకుడు) అని అర్థం. జైన గ్రంథమైన రాజావళి కథలో అమిత్రఘాత, సింహసేనానునిగా వ్యవహరింపబడినాడు. పురాణాలలో చంద్రగుప్తుని కుమురుడి పేరు బిందుసారునిగా ఉన్నది. తక్షశిలలో బిందు సారుని
పాలనా కాలంలో ఒక తిరుగుబాటు సంభవించింది. అది ప్రజా విప్లవం. ఆ తిరుగుబాటును అణచడానికి బిందుసారుడు తన కుమారుడైన అశోకుడిని పంపగా రాజ ప్రతినిధిగా అశోకుడు తక్షశిలలో నియమించబడినాడు. అశోకుడు ప్రజలతో చర్చించి తక్షశిలలో ప్రజలు తిరుగుబాటును అణచివేసి, ఆ ప్రాంత పాలకులకు శకులను ఓడించి రాజ్యమును విస్తరించాడు. సిరియా రాజు మెగస్తనీసు స్థానమున డెయిమబోనను మగధ రాజ్యమునకు రాయబారిగా పంపించెను. ఈజిప్టు దేశమును క్రీ.పూ. 285-247 వరకు పాలించిన రెండవ టోటెమీ ఫిలడెల్ఫస్, తన రాయబారి
అయోనిసనను బిందు సారుని రాజ్యానికి పంపించాడు. ఈ విషయాలు ప్లినీ రచనల వలన తెలుస్తున్నవి. బిందుసారునికి, సిరియా రాజు అయిన ఒకటవ అంటియోకస్పోటెర్ మధ్య గౌరవ మర్యాదలతో కూడిన ఉత్తర ప్రత్యుత్తరాలు సాగినవని అధోనయాస్
తెలిపాడు. బిందుసారుడు అంటియోకనను "తీయని ద్రాక్షరసము, ఎండిన అత్తిపండ్లు, ఒక గ్రీకు పండితుణ్ణి పంపించమని" కోరినట్లు హెగెసండర్ రచనలు తెలుపుతున్నవి. అశోకుడిని 18వ సంవత్సరాలు ఉన్నప్పుడు బిందుసారుడు అతినిని విదిశా నగర రాజధానిగా అవంతీ దేశమును పాలించుటకు రాజప్రతినిధిగా పంపించాడని గ్రీకు గ్రంథాల వలన తెలుస్తున్నది. అశోకుడు తన 5వ శిలాశాసనంలో తనకు సోదర, సోదరీ మణులున్నట్లు తెలియపరిచాడు. సుసీమ, విగతాశోకుల పేర్లు దివ్యావదాన గ్రంథము ద్వారా తెలుస్తున్నవి. మొత్తం మీద బిందుసారుడు 27 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడని తెలుస్తున్నది.
అశోక చక్రవర్తి
బిందుసారుని తరువాత అతని పుత్రుడు అశోకుడు మగధ రాజ్యానికి రాజైనాడు. భారత రాజకీయ చరిత్రలో అశోకునికి ప్రత్యేక స్థానం కలదు. కళింగ రాజ్యం స్వతంత్ర రాజ్యంగా ఉండడం నచ్చని అశోకుడు కళింగ పై దండ్రయాత్ర జరిపగా ఆ యుద్ధంలో అసంఖ్యాకమైన సైనికులను హతమార్చి ఆ రాజ్యంను జయించి మగధలో కలుపుకున్నాడు. అశోకుడు కళింగ యుద్ధానంతరం బౌద్ధ మతమును స్వీకరించి ఆ మతమును ఖండ ఖండాంతరాలందు వ్యాపింప జేశాడు.
అశోకుడు అనేక శాసనాలను వేయించాడు. ఈ శాసనాలను గండ శిలలపైనా, శిలా స్తంభములపైనా మానవ శ్రేయస్సును కోరి వేయించాడు. పాళీ, సంస్కృత భాషలలో రచించబడిన అనేక బౌద్ధ. బౌద్ధేతర గ్రంథములు అశోకుడి వ్యక్తిత్వము, రాజ్యపాలనా విధానము, బౌద్ధ ధర్మములను తెలుపుతున్నవి. బృహత్మిలలపైన, గండ శిలలపైన, స్తంభముల పైనను చెక్కబడిన శాసనములు మొదటి విభాగమునకు చెందినవి. ఇందులో ముఖ్యమైన శాసనాలు 14. కళింగ దేశమందున్న ధౌళి, ఔగడలందు అశోకుని శాసనములు లభ్యమైనవి. చిన్న శిలా శాసనములు సాధారణముగా ప్రజలనుద్దేశించి, జీవహింస చేయరాదని, సర్వమానవ సౌభ్రాతృత్వము కలిగి ఉండాలి అని ఉద్బోధించునవి. తోప్రాలోని ఒక స్తంభముపై చెక్కబడిన 7 శాసనములు పేర్కొనదగినవి. ఏడవ శాసనము చెక్కబడిన స్తంభము మీరట్ పట్టణము నుండి ఢిల్లీ నగరమునకు తరలింపుబడినది. ఈ శాసనముల వలన, ముఖ్య సంఘటనలు తెలియకున్నను, అశోక చక్రవర్తి మానవతా దృక్పథము, నిరాడంబరత, ప్రజా పరిపాలనా విధానము, దేశ స్థితి తెలిసికొనుటకు వీలగుచున్నది. దివ్యావదానమను బౌద్ధ గ్రంథము అశోకుని జీవితచరిత్ర తెలుసుకోవడంలో కొంతవరకు తోడ్పడుచున్నవి. బిందుసారుని మరణానంతరము అశోకుడు తన 99 మంది సోదరులను హత్యచేసి సింహాసనం అధిష్టించినట్లు ఈ గ్రంథములు తెలిపినవి సోదరులతో యుద్ధం చేసి వారి అశోకుడు సంహరించినాడనడానికి ఎటువంటి ఆధారము లేదు. అశోకుని తండ్రి అయిన బిందుసారుడు పాటలీపుత్ర నగరంలో మరణించాడు. అశోకుడు పట్టాభిషేకం చేసుకోవడంలో రాజకీయ చతురుడు, మంత్రి పదవిలో ఉన్న వాడు, మగధ సామ్రాజ్య విషయములను గురించి తెలిసిన వాడైన రాధాగుప్తుడు అత్యంత చాకచక్యంగా ప్రదర్శించాడు. అశోకుడు పట్టాభిషిక్తుడైన తరువాత రాధాగుప్తుని తన ప్రధాన మంత్రిగా నియమించాడు. అశోకుడు తన 4, 5 సంఖ్య గల ధర్మ లిపి శాసనములందు వెల్లడించెను. అశోకుని మస్మి గుజర్ర వంటి చిన్న చిన్న శిలా శాసనములందు తప్ప తక్కిన శాసనములన్నింటిలోను అతడు 'దేవానంపియ', 'పియదసి' అని వర్ణింపబడినాడు.
భారతావనిని పాలించిన ప్రాచీన రాజులు, మహా చక్రవర్తులు 'రాజ' శబ్దమును బిరుదుగ వాడినారు. కళింగ యుద్ధంలో జరిగిన బీభత్సమును గురించి అశోకుడు తన 8వ శిలా శాసనంలో వర్ణించాడు. "1,50,000 మందికి కళింగ యుద్ధమున బందీలైనారు. 1,00,000 సైనికులు వధింపబడినారు. ఈ సంఖ్యకు మరికొన్ని రెట్ల ప్రజలు మరణించారు". కళింగ యుద్ధంలో జరిగిన ఘోరాన్ని కళ్లార చూసిన అశోకుడి మానసిక ప్రవర్తనలో మార్పు కలిగింది. జీవితంలో యుద్దము అనే మాటను తలపెట్టనని శపథం చేశాడు. బౌద్ధమతాన్ని అవలంభించి అహింసా పరమోధర్మః అనే సూత్రాన్ని పాటిస్తూ జీవితాంతం బౌద్ధమత వ్యాప్తికి అవిరళ కృషి చేశాడు. అశోకుడు ఉపగుప్తుడు అనే బౌద్ధ సన్యాసి ద్వారా బౌద్ధ మతానుయాయిగా మారాడు.
అశోకుని శాసనభాష జన సామాన్యమున వాడుకలోనున్న పాళీ భాష. కళింగ యుద్ధం తరువాత అశోకుడు రెండు నిర్ణయాలకు కట్టుబడినాడు : 1) యుద్ధములను చేయకుండు, 2) సత్కార్యాచరణ. అశోకుని 10వ రాజ్య సంవత్సరం నాటికి అతడు బౌద్ధమత స్వీకారమొనర్చాడు. బౌద్ధమతమందలి తాత్విక దృక్పథముకన్న అందలి నైతిక దృక్పథం అశోక చక్రవర్తి ఎక్కువగా ఆకర్షించినది. మతం బోధించునట్టి ధర్మచింతన, ప్రజోపయోగ కార్యక్రమాలకు అశోకుడు ప్రాధాన్యమిచ్చాడు. అశోకుడు తన శాసనాలలో "సంఘే ఉపెదె" అనే పదం విరివిగా వాడినాడు. దీనిని అనుసరించి కొందరు చారిత్రకులు అశోకుడు బౌద్ధసన్యాసి అయినాడని తెలిపారు. చైనా యాత్రికుడగు ఇత్సింగ్ బౌద్ధ సన్యాసి వేషంలో ఉన్న అశోకుని విగ్రహమును తాను చూసినట్లు తెలిపాడు.
తన రాజ్య కార్యనిర్వహణకు సంబంధించిన విధులను పూర్తి చేయుట తన విద్యుక్త ధర్మమని అశోకుడు తాను వేయించిన 6వ శిలా శాసనంలో విశదీకరించాడు. అశోకుని 14 శిలాశాసనాలలో రెండు జతల శాసనములు పాకిస్థాన్లోని పెషావర్ జిల్లాలోని షాహ్ బాజ్ గడి, హజర జిల్లాలోని మాన్ పేరాలలో కనుగొనబడినవి. ఈ శాసనములలో మూడవది ఉత్తరమున తోన్స్, యమునా నదుల సంగమము వద్దను, నాల్గవది కథియవార్ జిల్లాలోని గిర్నార్ చెంతను, ఐదవది మహారాష్ట్రలోని ధానా జిల్లాలోని సోపార వద్ద, ఆరవది పూరీ జిల్లాలోని భౌళి ప్రాంతంలో, ఏడవది ఒరిస్సాలోని గంజాం జిల్లా జాగడ వద్ద, ఎనిమిదవి కర్నూలు జిల్లా ఎర్రగుడి వద్ద లభించినవి. అశోకుని సామ్రాజ్యంలో వాయవ్యవ రాష్ట్ర రాజధాని అయిన తక్షశిల వద్ద, తూర్పు ఆఫ్ఘనిస్థాన్లో, జలాలాబాద్ ప్రాంతంలో, సిరియా లిపిలి ఉన్న శాసనాలు కనుగొనబడినవి. ఆఫ్ఘనిస్థాన్లో పాత కాందహార్ నగర సమీపంలో గ్రీకు, సిరియా భాషలో ఉన్న శాసనం ఒకటి లభించింది. కేవలం గ్రీకు భాషలో వేయింపబడిన మరొక శాసన మచట లభించినది. ఈ శాసనము 12వ శాసనము చిరవి భాగము, 13వ శాసనారంభ భాగము కలది. సెల్యూకస్ నుండి స్వాధీన పరచుకొనిన ఈ రాజ్య భాగములు మౌర్య రాజ్యాంతర్భాగములుగ నుండెనని తెలియుచున్నది. కర్నాటక రాష్ట్రమందలి చితల దుర్గా ప్రాంతమున అశోకుడు వేయించిన మూడు శాసనములున్నవి. జబల్ పూర్ జిల్లా - రూపనాధ్, సల్మిగుండు, మధ్యప్రదేశ్ లోని దతియాజిల్లా - గుజరా, ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ జిల్లా - అహరౌర్, న్యూఢిల్లీ - అమరపురి కాలని, ఆంధ్రప్రదేశ్ - కర్నూలు మండలంలోని రాజుల మందగిరి, ఎర్రగుడి మొదలైన ప్రాంతాల్లో అశోక చక్రవర్తి వేయించిన చిన్న చిన్న శిలాశాసనాలు కలవు. బుద్ధుని జన్మస్థలమైన లుంబిని, అక్కడికి చేరేమార్గంలో ఉన్న తారియా అరరాజ్, రాంపుర్మా, నందన ఘర్, నిగిల్వ అనే బౌద్ధ క్షేత్రాలలో లుంబినికి వెళ్ళే మార్గంను సూచించే కొన్ని శిలా స్తంభ శాసనాలు కలవు. ఉత్తర భారతదేశమందలి అంబాలా, మీరట్ జిల్లాలోను; అలహాబాద్ సమీపంలో గల కౌశాంబి వద్ద, సారనాధ్, సాంచీల యందును శాసన స్తంభములు నెలకొల్పబడినవి. కృష్ణానది దక్షిణ తటముననున్న అమరావతిలో అశోకుని శాసన స్తంభ శకలము కనుగొనబడింది. మస్కి గుజర్రా శాసనములందు అశోకుని పేరు ప్రస్తావించబడింది. మిగిలిన శాసనములందు "దేవానమ్ పియ పియదసి" పదమున్నది. రుమిండై అనే ప్రదేశంలో కనుగొనబడిన అశోకుని శిలాశాసన స్తంభము వలన బుద్ధుని జన్మస్థలము " లుంబిని" అని తెలుస్తున్నది. "ఇక్కడ బుద్ధుడు జన్మించెను" అని అశోకుడు ఈ శాసన స్తంభంపై వ్రాయించెను. అశోకుని 13వ శిలా శాసనమును అనుసరించి ఆటవిక రాజ్యమొకటి కళింగ దేశానికి దగ్గరలో ఉన్నట్లు తెలుస్తున్నది.
అశోకుడు బౌద్ధమత ప్రచారము
అశోద చక్రవర్తి తాను వేయించిన శాసనాల ద్వారా బౌద్ధ ధర్మ సూత్రాలను, వాటి ఆచరణను ప్రజలకు బోధించి వారి ప్రగతికి కృషి చేశాడు. సన్యాసులు, స్నేహితులు, సహచరులు, బంధువులు, వృద్ధులు సహాయం పొందటానికి అర్హులు. వారికి ధనమును, ప్రేమను పంచి ఇవ్వడం రాజ్య ప్రజలందరి కర్తవ్యమని అశోకుడు తెలిపినాడు. మతాచారము కన్నా గుణము, నడవడిక, సౌశీల్యములే ఎక్కువ ప్రాధాన్యమును కలిగిఉండాలని, నీతిని,
సత్ప్రవర్తనను పాటించుట మంచి ఆచారమని అశోకుడు తన 12వ శిలాశాసనంలో పేర్కొన్నాడు. మత సహనానికే కాకుండా ఆయా మతాలను గౌరవించేటటువంటి బుద్ధిని మనుషులందరూ వికసింపజేయాలని అశోకుడు తన 12వ శిలాసానంలో ఆదేశంతో కూడిన విన్నపాన్ని చేశాడు. బరాబర్ కొండలలో తాను తవ్వించిన గుహలను అశోకుడు అజినీక యోగుల ఆవాసానికి దానం చేశాడు. వీరు జైన మతానుయాయులు. దీని వలన అశోకుడి పరమత సహనం కలవాడని తెలుస్తున్నది. అప్పటి వరకు రాజ భోజనానికి అసంఖ్యాకమైన జంతువులను వధించడం అశోకుడు మాన్పించాడు. దానికి పరిమితి విధించి ఒక దుప్పిని, రెండు నెమళ్ళను వధించడానికి మాత్రమే అనుమతించాడు. తరువాత కాలంలో మాంసాహారాన్ని కూడా నిషేధించాడు. అహింసా సూత్రాన్ని తన రాజాంతఃపురానికి పరిమితం చేయకుండా మగధ సామ్రాజ్యం మొత్తానికి కూడా, విదేశాలలో అమలు పరచడానికి కృషి చేశాడు. విదేశ దండయాత్రలకు బదులు ఆయా దేశాలలో ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించడం, బుద్ధ ధర్మ ప్రచారానికి ప్రజలను నీతి మార్గాచరణులుగా చేయడం కొరకు అశోకుడు తన దూతలను ఆయా దేశాలకు పంపించాడని అతడు వేయించిన 13వ శిలా శాసనం ద్వారా తెలుస్తున్నది.
అశోకుడు వేయించిన 14వ శిలాసానంలో అతను నైతిక సూత్రములను జీవితంలో అమలుపరచడమే తప్ప యుద్ధానికి సంబంధించిన ఆదేశాలు అనుమతించ లేదని ప్రకటించాడు. అశోకుడి కాలంలో పాటలీపుత్ర
నగరంలో మూడవ బౌద్ధ సంగీతి నిర్వహించబడింది. ఈ విషయం మహావంశ గ్రంథం ద్వారా తెలుస్తున్నది. మొగ్గలిపుత్త లేదా ఉపగుపుడు అనే బౌద్ధ సన్యాస్సి మూడవ బౌద్ధ సంగీతికి అధ్యక్ష వహించాడు. వివిధ దేశాలలో బౌద్ధ మత ప్రచారం చేయడానికి బౌద్ధ సన్యాసులను పంపడానికి ఈ సమావేశంలో తీర్మానం చేయబడింది.
బౌద్ధ ప్రచారం నిమిత్తం వివిధ దేశాలకు పంపబడిన వారు:
1) మద్దుం తకుడు - కాశ్మీరు, గాంధార
2) మహా రక్షితుడు యవన లేక గ్రీకు దేశం
3) మఝాముడు - హిమాలయ ప్రాంతం
4) ధర్మ రక్షితుడు పర్ణాంతకము
5) మహాధర్మరక్షితుడు - మహారాష్ట్ర
6) మహాదేవుడు- మహిష మండలానికి
7) రక్షితుడు వనవాస రాజ్యమునకు
9) నోణ ఉత్తరులు - సువర్ణభూమి
9) మహేంద్రుడు - సింహళ దేశానికి
అశోకుడు వేయించిన 2 మరియు 5 శిలాశాసనాల ద్వారా అతడు తన సరిహద్దులందున్న దేశాలకు సైతం బౌద్ధ ధర్మ ప్రచారకులను పంపినట్లు తెలుస్తున్నది. అశోకుడు పంపించిన బౌద్ధ మత ప్రచారకులు ఈజిప్టు, మాసిడోనియా, సిరేని, ఎపిరస్ మొదలైన దేశ పాలకులైన గ్రీకు రాజులనపు దర్శించి, అశోకుని అహింసా సూత్రాలను ప్రచారం చేయడంతో బాటు సమస్త జీవరాసుల బాధలను నివారించడానికి తగిన చర్యలు తీసుకొన్నారని అతను వేయించిన శిలాసనం 13 ద్వారా తెలుస్తున్నది. అశోకుడు అన్ని రంగాలలో కూడా జంతు సంహారమును, మాంస భోజనం నిషేధించాడు. క్రూర జంతువుల పోరాటాల వేడుకలను, ఇతర ఆటపోటీల హింసాత్మక చర్యలను నిషేధించాడు. అంతే కాకుండా మతం పేరుతో జరిపే జంతు బలులను కూడా రూపుమాపాడు. తన పూర్వీకులు అత్యంత ఉత్సాహంతో నిర్వహిస్తూ వచ్చిన వేటాడే వ్యసనాన్ని కూడా అశోకుడు. మానివేసినట్లు శిలా శాసనం ద్వారా తెలుస్తున్నది.
రాజ్యం లోని రాజూరలు, మహామాత్రులు, రాజప్రతినిధులు తమ పరిధిలోని రాజ్య భాగాలలో సంచలం లి, ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని, వారికి అన్ని విధాల తమ సహాయ సహకారాలు అదించడంతో పాటు ధర్మ మత ప్రచారాన్ని చేప్ నిర్వహించేస్తూ చక్రవర్తిని అనుకరించే వారని అశోకుడు తన 3వ శిలాశాసనంలో పేర్కొన్నాడు. అశోకుడు తన 25వ రాజ్య సంవత్సరంలో కొన్ని ప్రత్యేకమైన జీవులకు హాని కలిగించకూడదని ఒక శాసనాన్ని రూపొందించాడు. ఆహారంగా గాని, పేవలకు గాని, ఆర్ధిక పరంగా గాని ఉపయోగ పడని రామచిలుకలు, గబ్బిలాలు, అడవి బాతులు, చీమలు, ఉడుతలు, తాబేళ్ళు, ముళ్ళ పందులు, కొండలు, ఖడ్గమృగాలు, పావురాలు రక్షించబడాలని, ఉపయోగపడే సమస్త నాలుగు కాళ్ళు జంతువులకు రక్షణ కల్పించాలని వాటిని వధించడం తగదని ప్రకటిం చాడు.
సంవత్సరంలో 56 ప్రత్యేక రోజులలో చేపలను చంపరాదని, విక్రయించరాదని, తినరాదని అశోకుడు ప్రకటిం చాడు. అదే విధంగా కొన్ని ప్రత్యేక పవిత్రమైన రోజులలో ఆబోతులకు, దున్నలకు గిట్టలను కొట్టరాదు, గుఱ్ఱములకు వాతలు చేయరాదు. అని కూడా అశోకుడు ఉద్భోదించాడు. అశోకుడు తన జన్మదినం నాడు కారాగారంలో ఉన్న నేరస్థులను విడిచి విధానాన్ని అమలు చేశాడని అతని 5వ శాసనం ద్వారా తెలుస్తున్నది. ఉరిశిక్షకు గురైన వారికి ఉదారంగా మూడు రోజుల తరువాత శిక్ష అమలుపరిచే వారని 4వ శాసనం ద్వారా తెలుస్తున్నది. ప్రభుత్వ పాలనాపరి సూత్రాలను అనుసరించి అశోకుడు అల్ప ప్రాణులకు ఇచ్చిన ప్రాముఖ్యతను మానవ ప్రాణాలకు ఇవ్వలేదు. మూగ జంతువుల కన్నా మనుషులు మంచి చెడులను విచక్షణ కలిగి ఉంటారు కాబట్టి మానప్పుడు అమాయకుడు కాదని హంతకులు, దోపిడీదారులు, సంఘ ద్రోహుల ప్రాణాలకన్నా మూగజీవుల ప్రాణాలకు ఎక్కువ రక్షణ అవసరం అని అశోకుడు భావించాడు.
శిల్పకళ
అశోకుడు లలిత కళలు, శిల్పరులను పోషించిన కళాభిజ్ఞుడు. అనేద తల్ప కళాశోభితాలైన కట్టడాలను నిర్మింపజేశాడు. కలప, ఇటుకలతో నిర్మించే పద్ధతలకు బదులుగా శలానిర్మిత ఆరామ విహారాలను, చైత్యాలయాలను నిర్మించాడు. నగరాలు, స్థూపములు, విహారాలు ఏదశలా నిర్మిత స్తంభాలను అశోక చక్రవర్తి నిలు వాడు. పాటలీపుత్రంలోని అశోకుడి రాజభవనమును సందర్శిం చిన ఫాహియాన్ అక్మడి నిర్మాణాలను మాసి అవి మానవ మాత్రులు నిర్మించినవి కావని, దేవతా గణాలు నిర్మించారేమో అన్నంత అద్భుతంగా ఉన్నాయని వర్ణం వాడు. అశోకుడు బుద్ధని అవశేషాల పై నిర్మించబడిన 8 స్థూపములను తెలపించి, తాను నిర్మించిన 84000 స్థూపము అందు బుద్ధ ధాతువులను ఉంచాడని ఫాహియాన్ తన రచనల్లో పేర్కొన్నాడు. అశోకుడు పూర్వబుద్ధలలో ఒకడైన ధనముని స్థూపాన్ని రెండింతలు పెంచి నిర్మింప జేశాడని అతని శాసనాల ద్వారా తెలుస్తున్నది. సాం మహాస్థూపము చుట్టూ గల శిల్పశోభిత నిర్మాణమును అశోకుడు దర్శించాడు, అశోకుడు నిర్మించిన స్థూపాలు కొండ శిఖరాల వరి ఉన్నవని దివ్యావధానంలో వర్ణింబడింది. సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ చోప్రా నుండి ఒక అశోక స్తంభమును ఢిల్లీ నగరానికి చేర్చాడని తారీఖ్ ఫిరోజ్ షాహ్ ద్వారా తెలుస్తున్నది. మరొక శిలా స్తంభమును మీరట్ నుండి ఢిల్లీకి తరలించాడు.
నీటిపారుదల సౌకర్యాలు
గిర్నార్, జునాగఢ్ లకు చేరువలో ఉన్న దైవతర ఉర్టియర్ పర్వతాల పై ఉన్న పెలయేళ్ళకు ఆనకట్టులు వేయ వేయించి సుదర్శన తటాకాన్ని మౌర్య చంద్రదగుప్పుడు నిర్మించాడు. అశోకుడు ఆ తటాకాన్ని అభివృద్ధి చేశాడు. గంగా, యమునా నదుల నీటిని పంట పొలాలకు అందించే బృహత్ పథకాలు కూడా మౌర్య చక్రవర్తుల కాలంలో రూపొందించ బడినవి. సింధు, దాని ఉపనదుల జలాలను రైతులకు ఉపయోగపడునట్లు పంట కాలువలు త్రవ్వించబడినవి. అశోకుడు బౌద్ధ మఠాధిపతిగా ఉండేవాడని సారనాధ్, సాంపి శాసనాల ద్వారా తెలుస్తున్నది. బౌద్ధమత గ్రంథాల ప్రకారం అశోకుడిడి ముగ్గురు పుత్రులు అని తెలుస్తున్నది. అతని పుత్రులలో కుడాళుడు ఎనిమిది సంవత్సరాలు రాజ్యపాలన చేసినట్లు తెలుస్తున్నది.. కుదాతుని తరువాత ఐదుగురు మగధ రాజ్యాని పాలిం వారు. వారిలో చివరి వాడు బృహద్రథుడని వాయు పురాణంలో ప్రస్తావించబడింది. మధ్యపురాణం అశోకుని తరువాత 10 మంది రాజులు పాలించినట్లు తెలుస్తున్నది. విష్ణుపురాణం అశోకుని తరువాత ఏడుగురు రాజులు పాలించినట్లు తెలుపుతున్నది. రాజతరంగిణి గ్రంధం అశోకుని వారసునిగా జలౌకుడిని పేర్కొన్నది. అశోకుడికి గల దేవం ప్రియ బిరుదును దశరథుడు అనే మౌర్య రాజ ఉపయో గించుకున్నట్లు నాగార్జున కొండలలోని గుహా కుడ్యముల పై ఉన్న శాసనాల ద్వారా తెలుస్తున్నది.
మౌర్య రాజ్య పతనం
పుష్యమిత్రుడనే సైన్యాధికారి లివరి మౌర్యరాజు బృహద్రథుని వధించి రాజ్యం ఆక్రమించి నట్లు బాణుని హర్ష చరిత్ర ద్వారా తెలుస్తున్నది. పుష్యమిత్రుడు టంగ వంశానికి చెందిన వాడు. బ్రాహ్మణుడు. మౌర్య సామ్రాజ్య సైన్యాధ్యక్షుడు. బాక్రియా గ్రీకులు భారతదేశం పై దండెత్తి వచ్చే సమయాన్ని గమనించిన పుష్యమిత్రుడు బలహీనుడైన మగధ రాజైన బృహద్రథుని సంహరించి రాజ్య మాక్రమించడం వలన మౌర్య రాజ్యం అంతరించింది. విదేశీ దండయాత్రలు మౌర్యవంశం నశించడానికి కొంత వరకు కారణమైనవి. మగధ రాజ్యంలో ఏర్పడిన అంతః కలహాలు, అసమర్థత, భోగలాలస, విదేశీ దండయాత్రలు, సైన్యాదక్షుని స్వార్థ పరత్వం, అమాత్యుల అనైక్యత, అశోకుని అహింసా సిద్ధాంతాల వలన నిర్వీర్యులైన సైనికులు, ప్రజలు, అనిశ్చిత స్థితి, రాష్ట్ర పాలకుల స్వాతంత్య్ర్య ప్రకటన మౌర్య రాజ్య పతనానికి కారణమైనట్లు తెలుస్తున్నది. గాళ్ల సంహితాంతర్గత యుగ పురాణము, పతంజలి మహాభాష్యం వంటి సంస్కృత గ్రంథాలు యవనుల దండయాత్రల కారణంగా మగధ సామ్రాజ్యం త్వరితగతిన పతనమైందని తెలుపుచున్నవి.
మౌర్యుల పరిపాలన
మౌర్య వంశ పాలన సుమారు 137 సంవత్సరాలు సాగినట్లు చారిత్రక గ్రంధాలు, ఆధారాల ద్వారా తెలుస్తున్నది. మౌర్య చంద్రగుప్తుడు క్రీ.పూ. 324లో రాజ్యస్థాపన చేశాడు. క్రీ.పూ. 187లో చివరి రాజగు బృహద్రథుడు మరణించాడు. అశోకుని తరువాత కాశ్మీరంలో అతని పుత్రుడు జలౌక స్వతంత్ర రాజ్య స్థాపన చేశాడని, కనౌజ్ వరకు గల భూభాగం పాలించాడని తెలుస్తున్నది.
పరిపాలనా విశేషాలు
మౌర్య రాజ్యానికి రాజే సర్వాధికారి. రాజ్య పాలనలో రాజు పాత్ర ప్రధానమైనదిగా ఉండేది. పగటి వేళ రాజు నిద్రించరాదనే నియమం మౌర్యుల కాలంలో ఉండేది. రాజ్య పాలనలో రాజుకు సహకరించడానికి మంత్రిమండలి ఉండేది. ప్రజా వ్యవహార నిర్వహణలోనూ, రాజ్య పాలనా వ్యవహారాలలోనూ మంత్రులు, ప్రాడ్యివాకులు చక్రవర్తికి సలహా ఇచ్చేవారు. చంద్రగుప్తుడు అనేక మంది గూఢచారులను నియమించేవాడు. వీరిని పర్యవేక్షకులని మెగస్తనీస్ తెలిపాడు. మౌర్య రాజ్యంలో పురపాలక వ్యవస్థను మెగస్తనీస్ వర్ణించాడు. ఈ వ్యవస్థలోని అధికారులను మెగస్తనీస్ ఆస్తిగోమోయి అని తెలిపాడు. వారి విధులను కూడా వర్ణించాడు. మౌర్య రాజ్యంలో పురపాలక సంఘంలో ఆరు ఉప సంఘములను ఏర్పరచుకొని ఉండేవి. ప్రతి ఉప సంఘము ఐదు సభ్యులను కలిగి ఉండేది.
మొదటి ఉప సంఘము : పారిశ్రామిక, కళలకు సంబంధించిన సమస్త విషయాలను ఇందులోని సభ్యులు చూసేవారు.
రెండవ ఉప సంఘము : విదేశీ తిథులు స్వాగత సత్కారములను, వారికి వసతి ఏర్పాట్లు వంటి బాధ్యతల ఈ ఉపసంఘం సభ్యులు నిర్వహించేవారు.
మూడవ ఉపసంఘము : జనన మరణ విచార బాధ్యత మూడవ ఉపసంఘ సభ్యులు వహించేవారు. నాల్గవ ఉప సంఘము : ఈ సంఘ సభ్యులు వర్తక వ్యాపారాలను పర్యవేక్షించేవారు. ఐదవ ఉప సంఘము : ఈ సంఘం వారు ఉత్పత్తులను పర్యవేక్షించేవారు.
ఆరవ ఉప సంఘము : ఈ సంఘం సభ్యులకు వర్తకులు విక్రయించు సరుకులపై అమ్మకపు పరిమాణమును అనుసరించి పన్నులు వసూలు చేయుదురు. పన్నులు వసూలు చేయడంలో మోసానికి పాల్పడిన వర్తకులకు మరణశిక్ష విధింతురు. అగ్రో గొమోయి అనే జిల్లా అధికారి నిర్వహించు జిల్లా పరిపాలన గురించి మెగస్తనీసు పేర్కొన్నాడు. భూమి కొలతలు నిర్వహించటం, నదీ జలాలు రైతులు పంట పొలాలకు సక్రమ పద్ధతిలో అందించుట, పెద్ద కాలువల నుండి పిల్ల కాలువలలోని నీరు పారించుట, అట్టి భూములను పర్యవేక్షించు వివిధ తరగతులకు చెందిన అధికారుల గురించి మెగస్తనీస్ ఇండికాలో వర్ణించాడు.
సైనిక విధానం
చంద్రగుప్తుడు అతి పెద్ద సైన్యమును నిర్వహించెను. ఆరు లక్షల సైనికులున్న మౌర్య సైన్యమానాడు ప్రపంచమున ప్రఖ్యాతి గాంచి యుండెను. ముప్పయి మంది సభ్యులు గల యుద్ధ కార్యాలయం ఈ సైన్యమును నియంత్రించుచుండెను. చంద్రగుప్తుడీ 30 మంది సభ్యులను, మండలమును కేపురి చొప్పున ఆరు మండలములుగ విభజించెను. ఈ మండలంలో సైనిక కేంద్రాలకు ఒక నౌకా నిర్వహణాధిపతి సహకరించు చుండెను. ఐదు సైనిక మండలములకొక నౌకా నిర్వహణ ప్రత్యేక మండలము నిర్ధారింపబడెను. మిగిలిన ఐదు మండలాలు వివిధ సైన్య శాఖలను పర్యవేక్షించుచుండెను. యుద్ధ సామగ్రిని, పశువుల మేతను, సైనికుల ఆహార పదార్థములన సరఫరా చేయుటకు ఎడ్లబండ్లను ఉపయోగించేవారు. గంట మ్రోగించిన వెంటనే పశుగ్రాసము సరఫరా చేయుటకు నియమించబడిన గడ్డి కోతగాండ్రు ఉండేవారు. మగధ రాజ్యంలో రైతుల తరువాత అధిక సంఖ్యలో సైనికులుండేవారు. సైనికులు కేవలం సైనిక విధులను మాత్రమే నిర్వహిస్తూ అత్యంత స్వేచ్ఛాయుత జీవితమును గడిపేవారు.
మగధ సైనికులు ఉపయోగించే యుద్ధ పరికరాలను గూర్చి, ఆయుధాలను గూర్చి నియర్సస్ తెలిపిన ఆ కాలం నాటి విషయాలన్నీ వాస్తవాలే. చక్రవర్తి వేటకు వెళ్ళే సమయంలో చక్రవర్తి సంరక్షణకు స్త్రీ సైనికులు బాధ్యత వహించేవారు. అలంకరించబడిన గుఱ్ఱముపై ఎక్కి మౌర్య రాజపతాకమును ధరించిన స్త్రీమూర్తి బార్హత్ శిల్పంలో కలనిపిస్తుంది. గ్రీకు రచయితల ప్రకారం చంద్రగుప్తుడు కుక్కల సహాయంతో సింహాన్ని వేటాడేవాడు. చక్రవర్తి ఎడ్ల పందాలను చూస్తూ వినోదించేవాడు. రెండు గుఱ్ఱముల మధ్యన ఒక ఎద్దును కట్టిన రథముల పరుగు పందెములు ఆ రోజుల్లో జరిగేవి. రాచకార్య నిర్వహణకు రాజభవనము నుండి రాజసభా భవనమునకు చక్రవర్తి బయల్దేరేటప్పుడు అతనికి ఏనుగులు రక్షణగా ఉండేవి. ఆ కాలం లో యుద్ధ సమయంలో రైతులకు గాని, పంట పొలాలకు గాని ఎటువంటి నష్టం కలగ కుండా చర్యలు తీసుకునే వారు.
No comments:
Post a Comment