మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ (MS Excel) కోర్సులను సక్సెస్‌పుల్‌గా పూర్తిచేసి, అందులో పట్టు సాధిస్తే మంచి జీతంతో మార్కెట్‌లో ఎన్నో రకాల ఉద్యోగాలు ఉన్నాయి. అవేంటో పరిశీలిద్దాం.
ప్రస్తుతం చదువు పూర్తి చేసుకొని, ఉద్యోగాల కోసం సెర్చ్ చేస్తున్న వారికి కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి అవసరంగా మారింది. అందుకే అన్ని రకాల ఉద్యోగాలకు దీన్ని కంపెనీలు మినిమం రిక్వైర్‌మెంట్‌గా కోరుతున్నాయి. అయితే అకడమిక్స్‌లో డిగ్రీ, డిప్లొమాలో ఎన్నో రకాల ఎక్సెల్ కోర్సులు ఉన్నాయి. అభ్యర్థులు తమ ఆర్థిక స్తోమత, సమయం ఆధారంగా షార్ట్‌టర్మ్, లాంగ్‌టర్మ్ కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ (MS Excel) కోర్సులను సక్సెస్‌పుల్‌గా పూర్తిచేసి, అందులో పట్టు సాధిస్తే మంచి జీతంతో మార్కెట్‌లో ఎన్నో రకాల ఉద్యోగాలు ఉన్నాయి. అవేంటో పరిశీలిద్దాం.
డేటా అనలిస్ట్
ఇటీవల కాలంలో డేటా అనలిస్ట్‌లకు డిమాండ్ పెరుగుతోంది. సమస్యను పరిష్కరించడానికి డేటా సెట్స్‌ను సేకరించడం, అనలైజ్ చేయడం, ఇంటర్‌ప్రెట్ చేయడం వీరి ప్రధాన బాధ్యత. డేటా అనలిస్ట్‌లకు వార్షిక వేతనం యావరేజ్‌గా రూ. 5 లక్షల వరకు ఉంది.
ఆపరేషన్స్ అనలిస్ట్
డేటా అనాలసిస్‌ను సేకరించడం ద్వారా సంస్థ సామర్థ్యాన్ని మెరుగుపర్చడంలో ఆపరేషన్స్ అనలిస్ట్ ముఖ్య పాత్ర పోషిస్తారు. ప్రస్తుతం ఈ జాబ్ రోల్‌కు ఎంట్రీ లెవల్‌లో వార్షిక వేతనం రూ.5 లక్షలుగా ఉంది. వీటితో పాటు.. కంపెనీ సిబ్బంది సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తున్నారో ఎగ్జామిన్ చేయడంలో మేనేజ్‌మెంట్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్ అనలిస్ట్ కీలక పాత్ర పోషిస్తారు. ప్రస్తుతం MIS అనలిస్ట్స్ ప్రారంభ జీతం సంవత్సరానికి రూ.4 లక్షల వరకు ఉంది.
ఫైనాన్షియల్ అనలిస్ట్
కంపెనీలకు సంబంధించిన న్యూమరికల్ డేటాను పరిశోధించడం, ఇంటిగ్రేట్ చేయడం, విశ్లేషించడంలో ఫైనాన్షియల్ అనలిస్ట్ కీలక పాత్ర పోషిస్తారు. ప్రస్తుతం ఈ జాబ్ రోల్‌కు స్కిల్స్ ఉన్న వ్యక్తులకు వార్షిక వేతనం దాదాపు రూ.6,50,000గా ఉంది. వీటితో పాటు.. బిజినెస్ అనలిస్ట్ కంపెనీ వ్యాపారాన్ని అనలైజ్ చేస్తూ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు. ఇందులో బిజినెస్ ప్రాసెస్, అంచనా వివరాలు ఉంటాయి. ఈ జాబ్ రోల్‌కు ఎంపికయ్యే అభ్యర్థుల వార్షిక వేతనం ప్రస్తుతం రూ.7,00,000 వరకు ఉంది.
ప్రాజెక్ట్ మేనేజర్
ప్రాజెక్ట్ లక్ష్యాలపై ఫోకస్ చేయడంలో ప్రాజెక్ట్ మేనేజర్ కీలకంగా వ్యవహరిస్తారు. ప్రాజెక్ట్ కోసం అవసరమైన వర్క్, వనరులు సమకూర్చుకోవడానికి ప్లాన్ రూపొందిస్తారు. ప్రాజెక్ట్ మేనేజర్స్‌కు ప్రస్తుతం రూ.12లక్షల వరకు వార్షిక వేతనం ఉంటోంది.
ఆపరేషన్స్ మేనేజర్
ఆపరేషన్స్ మేనేజర్ కంపెనీ బిజినెస్‌కు సంబంధించి ప్రతి లెవల్‌లో అవసరమైన ఆపరేషనల్ యాక్టివిటీస్‌పై ఆపరేషన్స్ మేనేజర్ ఫోకస్ చేస్తారు. ఈ జాబ్‌రోల్ కోసం ప్రస్తుతం రూ.8,00,000 వరకు వార్షిక వేతనం ఆఫర్ చేస్తున్నారు.
బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్
కంపెనీ కోసం కొత్త క్లయింట్‌లను ఆకర్షించడంలో బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ కీలకంగా వ్యవహరిస్తారు. ఇందుకోసం కాంటాక్ట్ నెట్‌వర్క్‌ను క్రియేట్ చేస్తారు. ఈ ఉద్యోగానికి ప్రారంభ వార్షిక వేతనం రూ.8 లక్షలుగా ఉంది.
సేల్స్ మేనేజర్
సేల్స్ మేనేజర్ సేల్స్‌పర్సన్స్ టీమ్‌లకు సేల్స్ మేనేజర్ బాధ్యత వహిస్తారు. సేల్స్ పెంచడానికి టీమ్ మెంబర్స్‌కు అవసరమైన సూచనలు చేస్తూ కంపెనీ ఆదాయం పెరగడానికి కృషి చేస్తారు. ఈ జాబ్‌రోల్ వార్షిక వేతనం రూ.6లక్షలుగా ఉంది. వీటితో పాటు.. కస్టమర్ ఫిర్యాదులను త్వరగా, కచ్చితత్వంతో పరిష్కరించడం అకౌంట్ మేనేజర్ ప్రధాన బాధ్యత. ఈ జాబ్‌రోల్ వార్షిక వేతనం రూ.8 లక్షల వరకు ఉంది.
బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్
కంపెనీ కోసం కొత్త క్లయింట్‌లను ఆకర్షించడంలో బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ కీలకంగా వ్యవహరిస్తారు. ఇందుకోసం కాంటాక్ట్ నెట్‌వర్క్‌ను క్రియేట్ చేస్తారు. ఈ ఉద్యోగానికి ప్రారంభ వార్షిక వేతనం రూ.8 లక్షలుగా ఉంది.
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
07/04/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment