Indian Navy: త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో రిక్రూట్‌మెంట్ చేపట్టడానికి భారత ప్రభుత్వం అగ్నిపథ్ స్కీమ్‌ను(Agnipath scheme) గతేడాది తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా ఎంపికయ్యే వారిని అగ్నివీర్స్(Agniveers) అంటారు. తాజాగా ఇండియన్ నేవీ(Indian navy) అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ చేపడుతోంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. రిక్రూట్‌మెంట్ పూర్తి వివరాలను పరిశీలిద్దాం.
మొత్తం పోస్టులు 1465
అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఇండియన్ నేవీ మొత్తంగా 1465 పోస్ట్‌లను భర్తీ చేయనుంది. ఇందులో 1365 పోస్ట్‌లు అగ్నివీర్(SSR) 02/2023 బ్యాచ్, మిగతా 100 పోస్ట్‌లు అగ్నివీర్(MR) 02/2023 బ్యాచ్ ద్వారా భర్తీ చేయనున్నారు. వివాహం కాని పురుషులు, స్ట్రీ అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్ కోసం అప్లై చేసుకోవచ్చు. joinindiannavy.gov.in అనే అధికారిక పోర్టల్ ద్వారా జూన్ 15లోపు దరఖాస్తు చేసుకోవాలి.
అర్హత ప్రమాణాలు
గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి ఇంటర్ పాసై ఉండాలి. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ తప్పనిసరి సబ్జెక్ట్స్‌గా ఉండాలి. కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, బయాలజీలో ఏదో ఒకటి ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా 2002 నవంబర్ 01 నుంచి 2006 ఏప్రిల్ 30 మధ్య జన్మించి ఉండాలి. ఎన్‌రోల్‌మెంట్ సమయంలో అవివాహితుడు అనే కన్ఫర్మేషన్ డాక్యుమెంట్‌ను తప్పనిసరిగా సబ్‌మిట్ చేయాలి. నాలుగేళ్ల సర్వీస్ కాలంలో పెళ్లి చేసుకోకూడదు. ఒక వేళ వివాహం చేసుకుంటే, వారిని సర్వీస్ నుంచి తొలగిస్తారు.
ఎంపిక ప్రక్రియ
ఇండియన్ నేవీలో అగ్నివీర్ల ఎంపిక ప్రక్రియ అనేక దశల్లో ఉంటుంది. ముందు ఆన్‌లైన్ రాత పరీక్ష ఉంటుంది. ఆ తరువాత ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్ ఉంటుంది. చివరగా మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్
ముందు అధికారిక పోర్టల్ joinindiannavy.gov.inను విజిట్ చేయాలి. హోమ్‌పేజీలోకి వెళ్లి అప్లై ఆన్‌లైన్ అనే లింక్‌పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ ఇమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ వంటి వివరాలను ఎంటర్ చేసి సబ్‌మిట్ చేయాలి. దీంతో ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు మీ ఇమెయిల్‌కు వస్తుంది. వాటి సహాయంతో లాగిన్ అయి ఇండియన్ నేవీ అగ్నివీర్ -2023 రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ ఫారమ్‌ను ఫిలప్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేసి, అప్లికేషన్ ఫీజు రూ.550+18శాతం జీఎస్టీ చెల్లించాలి. చివరగా అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయాలి.
ఎగ్జామ్ ప్యాట్రన్
రాత పరీక్ష సీబీటీ మోడ్‌లో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ రూపంలో ఉంటుంది. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. మొత్తంగా నాలుగు సెక్షన్స్ నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
07/04/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment