ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అలర్ట్. వివిధ రకాల నోటిఫికేషన్లు కేంద్రం నుంచే కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విడుదల చేస్తున్నాయి. వీటికి దరఖాస్తుల ప్రక్రియ ముగియగా.. మరొకొన్నింటికి కొనసాగుతున్నాయి. ఇలా దరఖాస్తు చేసుకోవాల్సిన 5 నోటిఫికేషన్లో దాదాపు 13,543 ఖాళీలు ఉన్నాయి. వీటికి త్వరలో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఆ ఉద్యోగాల గరించి పూర్తిగా తెలుసుకుందాం.
ఇండియా పోస్ట్ GDS
గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల కోసం ఇండియా పోస్ట్ 12 వేలకు పైగా ఖాళీలను భర్తీ చేయనుంది. వీటికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మీకు కూడా అర్హత మరియు ఆసక్తి ఉంటే.. ఇండియా పోస్ట్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను indiapostgdsonline.gov.in సందర్శించాలి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 12828 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 11 జూన్ 2023.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో
టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 50 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. SBI యొక్క SCO పోస్ట్ కోసం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in లో ఈ పోస్ట్‌ల కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమైందది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జూన్ 5, 2023.
BDL రిక్రూట్‌మెంట్
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ ఇంజనీర్ లేదా ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లోని ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు bdl-india.in వెబ్ సైట్ సందర్శించి తమ దరఖాస్తులు చేసుకోవచ్చు. 23 జూన్ 2023 దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 100 పోస్టులను భర్తీ చేస్తారు.
DFCCIL ఉద్యోగాలు
డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మాత్రమే చేయాలి. మీరు DFCCIL యొక్క అధికారిక వెబ్‌సైట్‌కి dfccil.com వెళ్లాలి. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 535 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తారు. దరఖాస్తులు మే 20 నుండి ప్రారంభమయ్యాయి. వాటిపై దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 19 జూన్ 2023.
NTPCలో
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టుల కోసం దరఖాస్తులు మే 18 నుండి ప్రారంభం కాగా.. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జూన్ 01, 2023. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 30 పోస్టులను భర్తీ చేస్తారు. ఒక సంవత్సరం శిక్షణా కాలం పూర్తయిన తర్వాత.. అభ్యర్థి నెలకు రూ. 30,000 నుండి రూ. 1,20,000 వరకు జీతం పొందుతారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం.. అభ్యర్థులు ఈ రెండు వెబ్‌సైట్‌లలో దేనినైనా సందర్శించవచ్చు careers.ntpc.co.in లేదా ntpc.co.in.
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
07/04/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment