UGC NET 2023: చాలా మందికి టీచింగ్ ప్రొఫెషన్‌లో స్థిరపడాలని కోరిక ఉంటుంది. ఇండియాలో యూనివర్సిటీలు, కాలేజీల్లో ప్రొఫెసర్‌గా పని చేయాలని కోరుకుంటున్న వారు తప్పకుండా ఎలిజిబిలిటీ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(NET)లో తప్పక ఉత్తీర్ణత సాధించాలి. ఈ అర్హత పరీక్ష ఏటా జూన్, డిసెంబర్‌లలో సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుంది. అయితే ప్రస్తుతం యూజీసీ నెట్ 2023(UGC NET 2023) జూన్ సెషన్ అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ లింక్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in లో అందుబాటులో ఉంటుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA), నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(NET) జూన్ సెషన్ 2023 కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను 2023 మే 10 నుంచి స్వీకరిస్తుందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఛైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ మంగళవారం ప్రకటించారు. 2023 మే 31, సాయంత్రం 5:00 గంటల వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షలు 2023 జూన్ 13 నుంచి 2023 జూన్ 22 వరకు జరుగుతాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఎగ్జామ్ షెడ్యూల్, ఏవైనా ఇతర అప్‌డేట్స్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్‌లను క్రమం తప్పకుండా చెక్ చేయాలని సూచించారు. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) జూన్ సెషన్‌ను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తోంది. పరీక్ష 83 సబ్జెక్టులలో జరుగుతుంది, వీటిల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థానాలకు అర్హత పొందుతారు.
రిజిస్ట్రేషన్ ప్రాసెస్
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in ఓపెన్ చేయాలి. తర్వాత హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- అనంతరం అభ్యర్థి వివరాలను ఎంటర్ చేసి, అప్లికేషన్ ఫారమ్‌ను కంప్లీట్ చేయాలి.
- అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. చివరిగా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
UGC NET/JRF కోసం కీలకం
- UGC-NET అనేది ఇండియన్ యూనివర్సిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్(Assistant Professor), జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్(Junior Research Fellowship and Assistant Professor) స్థానాలకు భారతీయ పౌరుల అర్హతను అంచనా వేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించే పరీక్ష. అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్ కోసం నిర్వహించే అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన వారు అసిస్టెంట్ ప్రొఫెసర్‌ల నియామకానికి సంబంధిత వర్సిటీలు, కాలేజీలు లేదా రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు లోబడి ఉంటారు.

No comments:
Post a Comment