Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 9 July 2024

ప్రభుత్వ రంగ సంస్థలో 1217 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు..!

 నిరుద్యోగులకు మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ HLL లైఫ్‌కేర్ లిమిటెడ్‌ (HLL Lifecare Limited), వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

నిరుద్యోగులకు మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ HLL లైఫ్‌కేర్ లిమిటెడ్‌ (HLL Lifecare Limited), వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అకౌంట్స్ ఆఫీసర్, అడ్మిన్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, అడ్మిన్ అసిస్టెంట్, సెంటర్ మేనేజర్ వంటి ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్‌సైట్ https://www.lifecarehll.com/ విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఈ గడువు జులై 17న ముగుస్తుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలను పరిశీలిద్దాం.

* ఖాళీల వివరాలు

HLL లైఫ్‌కేర్ లిమిటెడ్‌.. కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు, IUD, సర్జికల్ సూచర్స్, బ్లడ్ బ్యాగ్స్, ఫార్మా ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది. లేటెస్ట్ నోటిఫికేషన్‌తో ఈ సంస్థ మొత్తం 1217 ఖాళీలను భర్తీ చేస్తుంది. అందులో అకౌంట్స్ ఆఫీసర్-2, అడ్మిన్ అసిస్టెంట్-1, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్-1, సెంటర్ మేనేజర్-4, సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్- 1206 ఖాళీలు ఉన్నాయి.

* ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్

-అకౌంట్స్ ఆఫీసర్

సీఏ/సీఎంఏ ఇంటర్, ఎంకామ్, ఎంబీఏ చదివిన వారు ఈ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే రెండేళ్ల వర్క్ ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరిగా ఉండాలి.

- అడ్మిన్ అసిస్టెంట్

కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. సంబంధిత విభాగంలో ఐదేళ్ల వర్క్ ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరి.

- ప్రాజెక్ట్ కోఆర్డినేటర్

ఎంబీఏ లేదా ఏదైనా విభాగంలో పీజీ పూర్తిచేసి ఉండాలి. అలాగే రెండేళ్ల వర్క్ ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరి.

- సెంటర్ మేనేజర్

హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎంబీఏ చేసినవారు, ఎంహెచ్‌ఏ, పబ్లిక్ హెల్త్‌లో మాస్టర్స్ చేసినవారు సెంటర్ మేనేజర్ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఐదేళ్ల వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.

- సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్

ఎనిమిదేళ్ల ఎక్స్‌పీరియన్స్‌తో మెడికల్ డయాలసిస్ టెక్నాలజీ/రీనల్ డయాలసిస్ టెక్నాలజీలో డిప్లొమా లేదా బీఎస్సీ చదివి ఉండాలి. లేదా ఆరేళ్ల ఎక్స్‌పీరియన్స్‌తో ఎంఎస్సీ పూర్తిచేసి ఉండాలి.

* జీతభత్యాలు

సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్స్‌కు జీతం నెలకు రూ. 14,000 నుంచి రూ.32,500 మధ్య లభిస్తుంది. అడ్మిన్ అసిస్టెంట్, అకౌంట్స్ ఆఫీసర్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, సెంటర్ మేనేజర్ పోస్ట్‌లకు రూ. 12,000 నుంచి రూ.29,500 మధ్య జీతం ఉంటుంది.

* అప్లికేషన్ ప్రాసెస్

- ముందుగా HLL లైఫ్‌కేర్ అధికారిక పోర్టల్ https://www.lifecarehll.com/ ఓపెన్ చేసి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి.

- వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.

- రిజిస్టర్ ఐడీ, పాస్‌వర్డ్ సాయంతో అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి.

- అన్ని వివరాలను ఎంటర్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.

- చివరగా అప్లికేషన్ ఫారమ్ సబ్‌మిట్ చేయాలి.

అలాగే DGM (HR), HLL లైఫ్‌కేర్ లిమిటెడ్, HLL భవన్, #26/4, వేలచేరి - తాంబరం మెయిన్ రోడ్డు, పల్లికరణై, చెన్నై - 600 100 అనే అడ్రస్‌కు సైతం అప్లికేషన్ ఫారమ్‌ను పోస్ట్‌లో పంపవచ్చు.

* వయోపరిమితి

HLL లైఫ్‌కేర్ లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 37 ఏళ్ల లోపు ఉండాలి.

* ఎంపిక ప్రక్రియ

వచ్చిన దరఖాస్తులను షార్ట్‌‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికయ్యే అభ్యర్థులు ఫిక్స్‌డ్-టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ ప్రకారం కేరళ, తమిళనాడు, ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, జార్ఖండ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లోని హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌ బ్రాంచ్‌ల్లో పనిచేయాల్సి ఉంటుంది.



No comments:

Post a Comment

Job Alerts and Study Materials