జాబ్ కోసం ఎదురుచూపుల్లో ఉన్నారా.. ఫ్రీ హాస్టల్ తో కూడిన జాబ్ ఆఫర్ ఇది. పూర్తి వివరాలు మీ కోసం.. !
టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారా.. ప్రవేట్ జాబ్ కోసం ఎదురుచూపుల్లో ఉన్నారా.. అయితే ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ చేతిలో జాబ్ ఉన్నట్లే.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆయా జిల్లా ఉపాధి కార్యాలయాలలో జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకున్న ఎందరో నిరుద్యోగులు ఉపాధి పొంది జీవనం సాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒంగోలులోని ఉపాధి కార్యాలయంలో ఈ నెల 30వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కార్యాలయం అధికారి భరద్వాజ్ తెలిపారు.
కె. ఎల్ గ్రూప్ ప్రత్యేకంగా అమెజాన్ రిటైల్ రంగంలో ఉద్యోగావకాశానికి సంబంధించి కంపెనీలో ప్యాకింగ్, పికింగ్, స్కానింగ్, లోడింగ్, అన్లోడింగ్ సెక్టార్ లలో వివిధ రకాల ఖాళీలను భర్తీచేయుటకు జాబ్ మేళా నిర్వహిస్తోంది. ఏదైనా విభాగంలో ఐ.టి.ఐ, డిప్లమో, టెన్త్, ఇంటర్మీడియేట్ ఏదైనా డిగ్రీ చదువులు పూర్తి చేసిన వారు 30వ తేదీన ఇంటర్వ్యూల కోసం జిల్లా ఉపాది కార్యాలయం, ఒంగోలులో హాజరుకావాలని కోరారు.
ఉదయం 10:00 గం.ల నుండి సాయంత్రం 3గం.ల వరకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు, ఇంటర్వ్యూ లో ఎంపిక కాబడిన అభ్యర్ధులకు జీతం నెలకు 16,975/- టేక్ హోమ్, ఉండడానికి నివాసము, రవాణా ఖర్చులు, ప్లస్ పనితీరు ఆధారంగా ఆకర్షణీయమైన ప్రోత్సాహకలు ఇవ్వటం జరుగుతుందని టి. భరద్వాజ్ తెలిపారు.
18సం,, నుండి 35 సం,, మధ్య గల నిరుద్యోగ యువతీ యువకులు ఈ సదవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఇంటర్వ్యూ కు ఆధార్ కార్డు, సరిఫికేట్స్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని..మరిన్ని వివరములకు https://forms.qle/wnfddgAQGrLSRwgg9 సైట్ ను సంప్రదించాలని కోరారు.
ఎంపికైన వారు హైదరాబాద్, చెన్నై నగరాలలో పని చేయాల్సి ఉంటుందన్నారు. మరెందుకు ఆలస్యం జాబ్ మేళాలో పాల్గొనండి.. జాబ్ ఛాన్స్ కొట్టేసేయండి మరి.
No comments:
Post a Comment